కశ్మీర్ విభజనకు రాజ్యసభ ఆమోదం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అప్‌డేట్స్

జమ్మూ కశ్మీర్‌లో పునర్విభజన బిల్లులో తొలి ఘట్టం ముగిసింది. రాజ్యసభలో ఉదయం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీర్మానం ప్రతిపాదిచారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దీనిపై మెజార్టీ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. అనంతరం అసెంబ్లీతో కూడిన జమ్ము కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ అదే సమయంలో లడఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కశ్మీర్ పునర్విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత రాజ్యసభ ఛైర్మెన్ ఓటింగ్‌కు అనుమతించారు. అయితే ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా నిర్వహించాలని భావించినప్పటికీ... సాంకేతిక సమస్య తలెత్తడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేయగా... వ్యతిరేకంగా 61 మంది సభ్యులు ఓటువేశారు. దీంతో కశ్మీర్ పునర్విభజన బిల్లు పాస్ అయినట్లుగా రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు హౌజ్‌లో ప్రకటించారు.

Kashmir turmoil LIVE: Opposition moves adjournment motion, govt statement shortly

Aug 05, 2019, 6:56 pm IST

రాజ్యసభ మంగళవారం ఆగష్టు 6 ఉదయం 11 గంటలకు వాయిదా
Aug 05, 2019, 6:54 pm IST

జమ్ము కశ్మీర్ విభజన బిల్లుకు ఆమోదం. 125 మంది మద్దతు, 61 మంది బిల్లుకు వ్యతిరేకం ఒకరు తటస్థం
Aug 05, 2019, 6:46 pm IST

సాంకేతిక సమస్యలతో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కు అంతరాయం... స్లిప్పులతో ఓటింగ్ నిర్వహణకు ఛైర్మెన్ ఆదేశం
Aug 05, 2019, 6:38 pm IST

జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Aug 05, 2019, 6:33 pm IST

జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ ప్రారంభం
Aug 05, 2019, 6:30 pm IST

అన్ని పరిస్థితులు సర్దుకున్నాక జమ్ము కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తాం: అమిత్ షా
Aug 05, 2019, 6:29 pm IST

జమ్ము కశ్మీర్‌‌ను ప్రతి ప్రభుత్వం అభివృద్ధి చేయాలనే తపనతోనే పనిచేసింది. అయితే విఫలమైంది: అమిత్ షా
Aug 05, 2019, 5:44 pm IST

శ్యాంప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించిన అమిత్ షా
Aug 05, 2019, 5:39 pm IST

ఆర్టికల్ 370 రద్దు పై సభలో వివరణ ఇస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
Aug 05, 2019, 5:32 pm IST

జమ్ముకశ్మీర్‌లో విభజన బిల్లును కూడా ప్రవేశపెట్టిన అమిత్ షా.. రేపు లోక్‌సభలో చర్చకు రానున్న బిల్లు
Aug 05, 2019, 5:30 pm IST

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్ షా
Aug 05, 2019, 4:54 pm IST

బిల్లు గురించి చర్చ జరగకూడదన్న కారణంతోనే బిల్లులోని అంశాలను రహస్యంగా ఉంచారు: కపిల్ సిబల్
Aug 05, 2019, 4:53 pm IST

బిల్లులో ఏముందో కూడా తెలియకుండా చర్చించమని చెప్పడం భావ్యం కాదు: కపిల్ సిబల్
Aug 05, 2019, 4:52 pm IST

బిల్లుపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా సభలో ప్రవేశపెట్టి చర్చించండి అంటే ఎలా: కపిల్ సిబల్
Aug 05, 2019, 4:49 pm IST

సబ్కా సాత్ సబ్‌కా వికాస్ అంటే బిల్లులు దొంగచాటు తీసుకురావడమా: కపిల్ సిబల్
Aug 05, 2019, 3:42 pm IST

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన తెలుగుదేశం. జమ్ముకశ్మీర్ ప్రజలు సంతోషంగా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్న టీడీపీ
Aug 05, 2019, 3:03 pm IST

న్యూఢిల్లీ

కశ్మీర్‌లో అసెంబ్లీ లేని సమయంలో ఆర్టికల్ 370 ఎలా రద్దు చేస్తారని గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు. గవర్నర్ అభిప్రాయం తీసుకుంటే సరిపోతుందా ? అని మండిపడ్డ ఆజాద్
Aug 05, 2019, 2:38 pm IST

లాహోర్

కశ్మీర్ అంశం అంతర్జాతీయ ఇష్యూ, దీనిపై తాము న్యాయపరంగా పోరాడుతామని ప్రకటించిన పాకిస్థాన్
Aug 05, 2019, 2:37 pm IST

న్యూఢిల్లీ

కశ్మీర్‌లో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ఆదేశం
Aug 05, 2019, 2:36 pm IST

న్యూఢిల్లీ

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్, డీజీపీలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది.
Aug 05, 2019, 2:34 pm IST

ముంబై

కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుచేయడంపై శివసేన చీఫ్ ఉద్దవ్ హర్షం, స్వీట్లు పంచిపెట్టిన అధినేత
Aug 05, 2019, 2:33 pm IST

న్యూఢిల్లీ

ఆర్టికల్ 370 రద్దు చేయడం భారత ప్రజాస్వాామ్యానికి చీకటి రోజని అభివర్ణించిన సీపీఎం ఎంపీ రంగరాజన్
Aug 05, 2019, 2:32 pm IST

ముంబై

కశ్మీర్‌కు 370 ఆర్టికల్ రద్దు చేయడంతో స్వీట్లు పంచుతున్న శివసేన కార్యకర్తలు
Aug 05, 2019, 2:09 pm IST

ఆర్టికల్ 370 రద్దుపై రేపు లోక్‌సభలో చర్చ
Aug 05, 2019, 1:23 pm IST

ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇక జమ్ము కశ్మీర్‌లో అభివృద్ధి దూసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆప్ అధినేత
Aug 05, 2019, 12:45 pm IST

ఆర్టికల్ 370 రద్దు కావడంతో సంబురాలు జరుపుకున్న కశ్మీరీ పండిట్లు
Aug 05, 2019, 12:41 pm IST

ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన అన్నాడీఎంకే
Aug 05, 2019, 12:38 pm IST

చారిత్రాత్మక తప్పిదంను నేడు బీజేపీ సర్కార్ సరిదిద్దింది..ఇక జమ్మూకశ్మీర్‌‌కు మంచి రోజులు రానున్నాయి: అరుణ్ జైట్లీ
Aug 05, 2019, 12:36 pm IST

ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏల రద్దను సమర్థిస్తూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వైసీపీ
Aug 05, 2019, 12:34 pm IST

ఆర్టికల్ 370ని సవరించడం ఇది తొలిసారి కాదు.. 1952లో 1962లో కాంగ్రెస్ సవరించింది. అందరి అనుమానాలను నివృత్తి చేస్తాను: అమిత్ షా
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+