Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలను కౌరవులతో పోల్చిన నటి, బీజేపీ లేడీ లీడర్, టార్గెట్ !

బెంగళూరు: బెంగళూరులో మే 23వ తేదీ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిద పార్టీల ముఖ్యమంత్రులు, మంత్రులు, అనేక పార్టీల నేతలు, ప్రముఖులు హాజరు అవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరౌతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలను కౌరవులతో పోల్చిన నటి, బీజేపీ లీడర్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు.

ఈ విషయంపై బహుబాష నటి, బీజేపీ నాయకురాలు మాళవిక అవినాష్ వివాదాస్పద ట్వీట్ చేశారు. 2019 ఎన్నికలకు కౌరవులు అందరూ సిద్దం అవుతున్నారా ? అంటూ ట్వీట్ చేశారు. హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రముఖులు అందరూ వస్తున్నారని మాళవిక అవినాష్ ట్వీట్ చేశారు.

Kauravas all set for 2019? HDK swearing in guest list:BJP leader Malavika Avinash tweets

అరవింద్ కేజ్రీవాల్, ఫారుఖ్ అబ్దుల్లా, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, ఎంకే, స్టాలిన్, ఓమన్ చాండి, ప్రఫు్లా కుమార్ మహంతా, సీతారామ్ ఏచూరి, డి. రాజా, శరద్ పవర్ కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరౌతున్నారు.

2019 ఎన్నికలకు కౌరవులు అందరూ ఇప్పటి నుంచి సిద్దం అవుతున్నారా అని బహుబాష నటి, బీజేపీ నాయకురాలు మాళవిక అవినాష్ ట్వీట్టర్ లో ప్రశ్నించారు. మాళవిక అవినాష్ ట్వీట్ పై పలువురు అనేక రకాలుగా స్పంధిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+