నటి కిడ్నాప్, లైంగిక దాడి: మా మేడమ్ కావ్య మాధవన్: బాంబు పేల్చిన పల్సర్ సునీ, జైలుకే ?
ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నటి లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సుని బుధవారం షాకింగ్ విషయం బయటపెట్టాడు.
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నటి లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సుని బుధవారం షాకింగ్ విషయం బయటపెట్టాడు. నటి లైంగిక వేధింపుల కేసులో ఓ మేడమ్ ఉన్నారని ఇంతకాలం పల్సర్ సుని చెబుతూ వచ్చాడు.
మేడమ్ ఎవరనే విషయం బుధవారం పల్సర్ సుని చెప్పేశాడు. ఇదే కేసులో అరెస్టు అయిన మలయాళం సూపర్ స్టార్ దిలీప్ రెండో భార్య, నటి కావ్య మాధవన్ అని పల్సర్ సుని చెప్పాడు. కేరళ పోలీసు అధికారులు కావ్య మాధవన్ ను విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు. గతంలో కొంత కాలం కావ్య మాధవన్ దగ్గర పల్సర్ సుని కారు డ్రైవర్ గా పని చేశాడు.

కోర్టు ముందు నిజం చెప్పాడు
బుధవారం పల్సర్ నునిని కేరళలోని ఎర్నాకులం సెషన్స్ కోర్టు ముందు హాజరుపరచడానికి తీసుకెళ్లారు. కోర్టులో విచారణలో భాగంగా తన మేడమ్ కావ్య మాధవన్ అని చెప్పాడు. కావ్య మాధవన్ పేరు ఇప్పటికే చాలసార్లు చెప్పానని పల్సర్ సుని అన్నాడు.

కావ్య రూ. 25 వేలు ఇచ్చారు
తనకు కావ్య మాధవన్ ఖర్చుల కోసం ఒక సారి రూ. 25,000 ఇచ్చారని పల్సర్ సుని అంగీకరించాడు. నేను ఒక దొంగను అంటూ కోర్టులో అంగీకరించాడు. మా మేడమ్ కావ్య మాధవన్ అని పల్సర్ సుని అంగీకరించడంతో పోలీసులతో పాటు అందరూ షాక్ కు గురైనారు.

కావ్య దగ్గర వీడియో ?
పల్సర్ సునీ కోర్టు ముందు కావ్య మాధవన్ పేరు చెప్పడంతో పోలీసులు ఆమెను విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు. నటిపై లైంగిక వేధింపులు జరిగే సమయంలో పల్సర్ సుని మొబైల్ లో వీడియో చిత్రీకరించాడని, ఆ మొబైల్ మెమొరి కార్డు కావ్య మాధవన్ దగ్గరకు ఇచ్చాడని ఇప్పటికే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇద్దరి కాపురాలు కూలిపోయాయి
లైంగిక వేధింపులకు గురైన నటి కారణంగా దిలీప్, కావ్య మాధవన్ కాపురాలు కూలిపోయాయని ఇద్దరూ ఆమె మీద కక్ష పెంచుకున్నారని తెలిసింది. దిలీప్ తన మొదటి భార్య, నటి మంజు వారియర్ కు విడాలుకు ఇచ్చాడు. కావ్య మాధవన్ మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత దిలీప్ ను రెండో పెళ్లి చేసుకున్నారు.

పక్కా సాక్షాధారాలు ఉన్నాయి
నటి లైంగిక వేధింపుల కేసులో ఏడు వారాల క్రితం అరెస్టు అయిన హీరో దిలీప్ కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు ఉన్నాయని కేరళ పోలీసు అధికారులు అంటున్నారు. ఇప్పుడు కావ్య మాధవన్ దగ్గర లైంగిక వేధింపుల వీడియో ఉన్న మెమొరి కార్డు చిక్కితే ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications