కేసీఆర్..నీ కుర్చీ నువ్వు కాపాడుకో : నితీష్ కుమార్ వాకౌట్ అందుకే..!!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. బిహార్ పర్యటనలో బిజీగా ఉన్నారు. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా జవాన్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో అమరులైన వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆయన బిహార్ వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం జాయింట్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

గురుద్వారాలో..
ప్రెస్‌మీట్ ముగిసిన అనంతరం కేసీఆర్ నేరుగా రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి దంపతులను కలుసుకున్నారు. తన నివాసానికి వచ్చిన కేసీఆర్‌ను రబ్రీదేవి శాలువ కప్పి గౌరవించారు. లాలూ ప్రసాద్‌తో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పాట్నాలోని గురుద్వారాను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
థర్డ్ ఫ్రంట్ యత్నాల్లో..
ఎన్డీఏ, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు కేసీఆర్. దేశవ్యాప్తంగా ప్రతిపక్షపార్టీల నాయకుల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా ఇదివరకు ఆయన హేమంత్ సోరెన్, ఉద్దవ్ థాకరే, శరద్ పవార్, స్టాలిన్‌లను కలుసుకున్నారు. ఇప్పుడు తాజాగా నితీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదంతో ఆయన పని చేస్తోన్నారు.

బీజేపీ నేత విమర్శలు..
కేసీఆర్ పర్యటనపై బిహార్‌కు చెందిన బీజేపీ నాయకులు ఘాటు విమర్శలు మొదలు పెట్టారు. కేసీఆర్-నితీష్ కుమార్-తేజస్వి యాదవ్.. థర్డ్ ఫ్రంట్ పేరుతో పగటి కలలు కంటోన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ మోదీ ఎద్దేవా చేశారు. తమ సొంత కుర్చీలను కాపాడుకుంటామో, లేదో తెలియని స్థితిలో ఉన్న కేసీఆర్, నితీష్ కుమార్- ప్రధాని మంత్రి కావాలంటూ కలలు కంటున్నారని, అవి ఎప్పటికీ నెరవేరబోవని అన్నారు.

టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం..
2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతోందని జోస్యం చెప్పారు. ముందు కేసీఆర్ తన కుర్చీని తాను కాపాడుకోవాలని చురకలు అంటించారు. ఇటు నితీష్ కుమార్ కూడా మరోసారి ముఖ్యమంత్రి కాలేడని, ఆయన పార్టీ అధికారంలోకి ఎప్పటికీ రాబోదని అన్నారు. నితీష్ కుమార్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ కూడా అంగీకరించట్లేదని, జాయింట్ ప్రెస్‌మీట్‌లోనే ఈ విషయం స్పష్టమైందని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications