ముస్లీం అమ్మాయిలకు హిజాబ్ లతో ఎంట్రీ, అయితే షరతులు వర్థిస్తాయి, గంట ముందే !
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ ధరించి పాఠశాలలు, కళాశాలలకు (college) వెళ్లడంపై గతంలో అనేక గొడవలు జరిగాయి. ఇప్పుడు కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (KEA) హిజాబ్ ధరించి పరీక్షకు హాజరు కావడానికి అనుమతి ఇచ్చింది. అదే నెలలో అక్టోబర్ 28, అక్టోబర్ 29 తేదీల్లో వివిధ కార్పోరేషన్ బోర్డుల పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హిజాబ్ (hijab) ధరించి ఈ పరీక్షలకు హాజరుకావచ్చని కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (కేఈఏఎ) తెలిపింది.
హిజాబ్ (hijab) వివాదం కర్ణాటక రాష్ట్రంలో పెద్ద వివాదానికి కారణమైంది. ఇప్పుడు కేఈఏ ( KEA) వివిధ బోర్డుల అర్హత పరీక్షల కోసం హిజాబ్ ధరించడానికి అనుమతించింది. అభ్యర్థులు పరీక్షకు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలి. హిజాబ్ లు (hijab) వేసుకుని పరీక్షలు రాయడానికి వచ్చే అమ్మాయిలను మహిళా సిబ్బంది తనిఖీ చేస్తారని కేఈఏ తెలిపింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిక్కెట్, ఇటీవల తీసుకున్న రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు, ప్రభుత్వం గుర్తించిన గుర్తింపు కార్డును (ID) తీసుకురావాలి. పరీక్ష ముగిసే వరకు వారిని బయటకు వెళ్లనివ్వబోమని కర్ణాటక (Karnataka) పరీక్ష అథారిటీ (KEA) తెలిపింది.

అసలు మ్యాటర్ ?
గత ఏడాది జనవరి 1వతేదీన ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో (college) ఆరుగురు విద్యార్థినులు హిజాబ్ ధరించకుండా మేము క్లాస్‌లకు హాజరుకామని తేల్చి చెప్పడంతో అక్కడ వివాదం మొదలైయ్యింది. తరువాత అమ్మాయిలు చేసిన ఆరోపణలతో ఈ హిజాబ్ (hijab) వివాదం వెలుగులోకి వచ్చింది. ముస్లిం విద్యార్థులు కళాశాల (college) అధికారులపై ఆరోపణలు చేశారు. అనంతరం నిరసనలు ప్రారంభించారు.
ఈ హిజాబ్ (hijab) వివాదం కొన్ని రోజులకే కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అంతేకాదు హిజాబ్ ధరిస్తే మేం కాషాయరంగు ధరిస్తాం అని హిందూ విద్యార్థులు పట్టుబట్టారు. కాషాయం కండువాలు వేసుకోవడానికి మాకు అవకాశం కల్పించాలని హిందూ విద్యార్థులు (student) పట్టుబట్టాడు. అలా ఈ వివాదం కర్ణాటక (karnataka)లోనే కాకుండా వివిధ రాష్ట్రాలకు కూడా పాకింది.
కాషాయ వస్త్రాలు ధరించిన విద్యార్థులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హిజాబ్ (hijab) ధరించిన విద్యార్థి అల్లా హు అక్బర్ అంటూ అరుస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ అంశం కర్ణాటక హైకోర్టు, సుప్రీం కోర్టుల (court) మెట్లెక్కింది. రాజకీయంగా ఒకరిమీద ఒకరు బురదజల్లడం కూడా ప్రారంభించారు. రాజకీయంగా హిజాబ్ వివాదంపై కర్ణాటకలోని గత బీజేపీ ( BJP) నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తన స్వరాన్ని పెంచుతూనే ఉంది.
బీజేపీ (BJP) తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించిన కాంగ్రెస్ (congress) వారి ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రజలకు, న్యాయ పోరాటాలకు అప్పట్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటక (karnataka) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను సమీక్షించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి కేసుల జాబితాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ (hijab) ధరించడాన్ని రాష్ట్ర విద్యాశాఖ నిషేధించింది. హిజాబ్‌ను నిషేధిస్తూ అప్పటి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు సమర్థించింది.












Click it and Unblock the Notifications