ఏప్రిల్‌ 22 నుంచి కేదార్ నాథ్‌ దర్శనం

మహా శివరాత్రి పర్వదినం వేళ శైవ భక్తులకు గుడ్ న్యూస్.. దాదాపు 6 నెలల తర్వాత కేదార్ నాథ్‌ ఆలయం తిరిగి తెరుచుకోనుంది. ఈ మేరకు ఏప్రిల్‌ 22న ఉదయం 8 గంటలకు తెరిచేందుకు ముహూర్తం ఖరారు అయింది. అలాగే ఏప్రిల్‌ 23న బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇక ఏప్రిల్‌ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కూడా తెరుచుకోనున్నట్లు దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు.

దేశంలోని ప్రఖ్యాత చార్‌ ధామ్‌ (ఉత్తరాఖండ్‌) పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏటా వచ్చే భక్తుల కోసం దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చకచకా చేస్తోంది. ఈమేరకు ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్​నాథ్​ ఆలయాన్ని దాదాపు 6 నెలల తర్వాత తెరవనున్నారు. ఏప్రిల్‌ 22న ఉదయం 8 గంటలకు తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేసింది దేవస్థానం బోర్డు. అలాగే బద్రీనాథ్‌ ఆలయాన్ని ఏప్రిల్‌ 23న, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్‌ 19న తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నాలుగు ఆలయాలను మంచు కారణంగా మూసివేసిన తర్వాత ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో తిరిగి తెరుస్తుంటారు.

ఇక ఉత్తరాఖండ్‌ లో ఉన్న బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్‌ నాథ్‌ ను చార్‌ ధామ్‌ అని పిలుస్తుంటారు. చార్‌ ధామ్‌ యాత్ర కోసం ఏటా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ యాత్ర సాధారణంగా హరిద్వార్, రిషికేష్ లేదా డెహ్రాడూన్ నుండి ప్రారంభమవుతుంది. యమునోత్రి.. గంగోత్రి.. కేదార్‌ నాథ్.. బద్రీనాథ్ ఇలా వరుస క్రమంలో దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ఆన్‌లైన్‌ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

KedarnathTemple Set to Reopen After 6-Month Winter Closure Good News for shiva Devotees world

ఇదిలాఉంటే.. చార్‌ ధామ్ కనెక్టివిటీకి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల కీలకమైన విషయాలను వెల్లడించారు. 125 కి. మీ. రిషికేశ్- కర్ణ్ ప్రయాగ్ రైలు మార్గం ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌ నాథ్, బద్రీనాథ్‌ లకు రైలు మార్గాన్ని విస్తరించడానికి సర్వేలు పూర్తైనట్లు తెలిపారు. అలాగే మార్చి 2026 నాటికి రూ. 40,384 కోట్లు ఖర్చుతో ఉత్తరాఖండ్‌ లో మొత్తం 216 కి. మీ. ల మూడు కొత్త రైలు మార్గాలపై పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+