మోడీకి కేజ్రీ సవాల్.. అదే స్థానంలో నేనుండి ఉంటే..
చట్టాలు మీకేమైనా చుట్టాలా..! ఇప్పుడు ఇదే తరహా ప్రశ్నను ప్రధాని నరేంద్రమోడీపై సంధిస్తున్నారు ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అగస్టా వెస్టు ల్యాండ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతల పట్ల మోడీ ప్రభుత్వం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే సోనియాగాంధీని అరెస్టు చేయాలని సవాల్ విసిరారు కేజ్రీవాల్.
మోడీ సోనియాగాంధీల మధ్య జరిగిన రహస్య ఒప్పందం మేరకే.. సోనియాగాంధీని ఇటాలియన్ కోర్టు నిందితురాలిగా పేర్కొన్నప్పటికీ మోడీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. అదే స్థానంలో నేనుండి ఉంటే ఈపాటికి ఎప్పుడో అరెస్టు చేసి జైళ్లో పెట్టేవారన్నారు. సోనియాను అరెస్టు చేసేందుకు మోడీ ప్రభుత్వం జంకుతోందన్న కేజ్రీవాల్.. ట్విట్టర్ వేదికగా మోడీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. మరి కేజ్రీ విమర్శల పట్ల మోడీ సర్కార్ ఎలా స్పందిస్తుందో..!













Click it and Unblock the Notifications