96 శాతంతో సత్తా చాటిన కేజ్రీవాల్ కూతురు హర్షిత
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత ఇంటర్‌లో సత్తా చాటారు. ఆమె సిబిఎస్ఈ క్లాస్ 12 పరీక్షల్లో 96 పర్సెంట్ సాధించారు. హర్షిత సైన్స్ విద్యార్థిని. తన తల్లిదండ్రులే తనకు ఆదర్శమని చెప్పారు. ఐఐటిలో చదవడం ఇష్టమన్నారు.
ప్రస్తుతం ఐఐటిలో అడ్మిషన్ పొందడం తన లక్ష్యమన్నారు. హర్షిత నోయిడాలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని. ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించిన హర్షిత... ఫిజిక్స్ తన సబ్జెక్ట్ అని చెబుతున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ నాయకులు. దీంతో ఆయన ఇంటికి ఎప్పుడు కార్యకర్తలు, నాయకుల తాడికి ఉంటుంది. మధ్య ఢిల్లీలోని తిలక్ లేన్‌లో వీరు ఇల్లు ఉంది. నిత్యం ఇంటికి కార్యకర్తల తాడికి ఉన్నప్పటికీ ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తన ఇంటికి ఎప్పుడు సందడిగా ఉంటుందని, అయినప్పటికీ తాను చదువు పైనే దృష్టి సారించానని చెప్పారు.
తన ఇంటిలో జరిగే రాజకీయ సమావేశాలు, ఇతర రాజకీయ కార్యక్రమాల గురించి తాను ఎప్పుడు పట్టించుకోలేదని చెప్పారు. కాగా, హర్షిత అత్యధిక మార్కులు సాధించినందుకు కేజ్రీవాల్‌కు కార్యకర్తలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీ వారికి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications