కేజ్రీవాల్ మేనల్లుడు వినయ్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

న్యూఢిల్లీ: అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మేనల్లుడు వినయ్ భన్సాల్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పీడబ్ల్యూడీ కుంభకోణంలో సీఎం మేనల్లుడు విజనయ్‌పై గతంలో ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణలపై ఏసీబీ అధికారులు గురువారం నాడు ఆయనను అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ బావ సురేందర్ కుమారుడు వినయ్. సురేందర్ బన్సాల్‌కు రేణు కన్స్‌స్ట్రక్షన్స్ పేరుతో కంపెనీ ఉంది. ఈ కంపెనీతో పాటు మరో రెండు కంపెనీలకు సీఎం కేజ్రీవాల్ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్రజైన్ కలిసి అక్రమంగా కొన్ని కాంట్రాక్టులు పొందారని రాకో వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

Kejriwal’s kin Vinay Bansal arrested in PWD scam

ఈ కంపెనీలు ఎలాంటి అభివృద్ది పనులు చేయకుండానే నకిలీ బిల్లులు చూపించి పీడబ్ల్యూడీ శాఖ నుండి నిధులను పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది మే లో వినయ్‌పై ఏసీబీ కేసులను నమోదు చేసింది.

మూడు కంపెనీల పేర్లను ఎప్‌ఐఆర్‌లో చేర్చించింది. ఈ కంపెనీలపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదైన రోజునే సురేందర్ బన్సాల్ అనారోగ్యంతో మరణించాడు. ఈ కంపెనీలు ఇచ్చిన బిల్లులు నకిలీవని తేలింది. ఈ విషయమై వినయ్ భన్సాల్ ను ఏసీబీ అాదికారులు అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+