దారుణం: ఇంటికి తీసుకెళ్తామని, కారులో ఎక్కించుకుని కెన్యా మహిళపై గ్యాంగ్‌రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధానికి సమీపంలోని గుర్గావ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న ఓ కెన్యా దేశానికి చెందిన మహిళను ఇంటి వద్ద దింపుతామని నమ్మబలికి కారులో ఎక్కించుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. గురువారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్గావ్‌లోని బ్రిస్తోల్ చౌక్‌లో తాను నివాసం ఉండే దక్షిణ ఢిల్లీ ఛత్తపూర్‌కు వెళ్లేందుకు క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న కెన్యాకు చెందిన మహిళను ముగ్గురు యువకులు స్కార్పియోలో వచ్చి ఛత్తపూర్‌లో దింపుతామని చెప్పి కారులో ఎక్కించుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆ ముగ్గురు యువకులు వారి మరో ఇద్దరు స్నేహితులను కూడా పిలిపించుకున్నారు. మొత్తం ఐదుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను స్పృహకోల్పోయేలా కొట్టి అక్కడ్నుంచి పరారయ్యారు.
కొంతసేపటికి తేరుకున్న బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కారు నెంబర్ ఆధారంగా ఐదుగురు నిందితుల్లో సుధీర్, మోహిత్, ప్రవీణ్ అనే ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించామని, ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదిక తేల్చిందని చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications