శబరిమల ప్రవేశించడానికి ప్రయత్నించిన కిస్ ఆఫ్ లవ్ రెహ్నా ఫాతిమా ఎవరు!

తిరువనంతపురం: ప్రశాంతంగా ఉంటున్న శబరిమల కొండలు శుక్రవారం అయ్యప్పస్వామి భక్తుల శరణుహోషతో దద్దరిల్లింది. అయ్యప్పస్వామి దర్శనం చేసుకుంటామని ఇద్దరు మహిళలు కొండ మీదకు రావడంతో స్వామి భక్తులు నిరసన వ్యక్తం చేశారు. హిందువుల సాంప్రధాయాలకు ఆటంకాలు ఎదురైతే చూస్తూ సహించమని అయ్యప్ప భక్తులు కేరళ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శబరిమల ప్రవేశించడానికి ప్రయత్నించిన కిస్ ఆఫ్ లవ్ రెహ్నా ఫాతిమా ఎవరు ? అంటూ తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది.

విజయదశమి

విజయదశమి

విజయదశమి సందర్బంగా శుక్రవారం శబరిమలలో అయ్యప్పస్వామి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలో బారులు తీరారు. అదే సమయంలో భారీ బందోబస్తుతో ఇద్దరు మహిళలు అయ్యప్పస్వామి దర్శనం చేసుకోవడానికి కొండ మీదకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసు దుస్తులు

పోలీసు దుస్తులు

హైదరాబాద్ కు చెందిన మోజో టీవీ పాత్రికేయురాలు కవితా (29), కేరళకు చెందిన సామాజిక ఉద్యమ కారిణి రెహ్నా ఫాతిమా (31) శుక్రవారం పంబ నుంచి సన్నిదానం దగ్గరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య బయలుదేరారు. కవిత పోలీసు దుస్తులు, హెల్మెట్ ధరించి సన్నిదానం దగ్గరకు బయలుదేరారు. భక్తుల నిరసన మధ్యలోనే మహిళలను పోలీసులు తీసుకెళ్లారు.

అర్చకుడి వార్నింగ్

అర్చకుడి వార్నింగ్

మహిళలు గర్బగుడి వద్దకు వస్తే ఆలయం మూసివేస్తామని ఆలయం ప్రధాన అర్చకుడు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎన్నడు లేని విధంగా 34 మంది అర్చకులు విధులు బహిష్కరించి భక్తులతో కలిసి ఆందోళకు దిగడంతో పరిస్థితి విషమించింది. చివరికి స్వామి వారిని దర్శనం చేస్తాం అని పట్టుబట్టిన ఇద్దరు మహిళలు కవితా, రెహ్నా ఫాతిమా వెనక్కి తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

వివాదాల ఫాతిమా

వివాదాల ఫాతిమా

సాంప్రధాయ ముస్లీం కుటుంబంలో రెహ్నా ఫాతిమా జన్మించి అదే సాంప్రధాయంతో పెరిగింది. ఫాతిమాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత మార్చి నెలలో ఫాతిమా భారీ చర్చకు తెరతీశారు. కేరళలోకి కొచ్చికి చెందిన ఓ లెక్చరర్ మహిళలు ఎప్పుడు తమ ఎద భాగాన్ని పుచ్చకాయ (వాటర్ మిలన్) మూసుకున్నట్లు జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో లెక్చరర్ వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన రెహ్నా ఫాతిమా రెండు పుచ్చకాయలు తీసుకుని ఆమె ఎద భాగంలో పెట్టుకుని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రెహ్నా ఫాతిమా ఫోస్టుకు దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో ఆఫోటోలను ఆమె డిలీట్ చేసింది.

కిస్ ఆఫ్ లవ్

కిస్ ఆఫ్ లవ్

2014లో కిస్ ఆఫ్ లవ్ అంటూ నైతిక్ పోలీస్ గిరికి వ్యతిరేకంగా సినీ దర్శకుడు మనోజ్ శ్రీధర్ ప్రారంభించిన క్యాంపైన్ లో రెహ్నా ఫాతిమా చురుకుగా పాల్గొన్నారు. ఓణం పండగ సందర్బంగా ఫాతిమా పులివేశం ధరించి చర్చకు తెరతీశారు. పురుషుల కంటే స్త్రీలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఫాతిమా ఎప్పుడు వాదిస్తుంటుంది.

ఇంటర్ సెక్స్ ఏకా సినిమా

ఇంటర్ సెక్స్ ఏకా సినిమా

ఇంటర్ సెక్స్ కథ ఆధారంగా తెరకెక్కిన ఏకా అనే సినిమాలో రెహ్నా ఫాతిమా నటించారు. ముస్లీం సాంప్రధాయాలకు వ్యతిరేకంగా ప్రవర్థిస్తున్నదని రెహ్నా ఫాతిమా మీద ఆమె కుటుంబ సభ్యులు అనేక సార్లు మండిపడ్డారు. అయితే ఫాతిమా మాత్రం ఆమె ప్రవర్తన మార్పుకోలేదు. తండ్రి మరణించిన తరువాత రెహ్నా ఫాతిమా ఆమె కుటుంభానికి దూరంగా ఉంటున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+