అయ్యప్పమాలతో అసభ్య దుస్తులు, రెహనా ఫాతిమాను సస్పెండ్ చేసిన బీఎస్ఎన్ఎన్, నీచంగా ఫోటోలు!

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప సన్నిదానం చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటానని ప్రకటించి వివాదానికి కారణం అయిన రెహనా ఫాతిమాను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. రెహనా ఫాతిమాను అరెస్టు చెయ్యడంతో ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశామని బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం ప్రకటించింది. నిత్యం వివాదాలకు కారణం అయిన రెహనా ఫాతిమాను జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే బీఎస్ఎన్ఎన్ యాజమాన్యం హెచ్చరించినా ఆమె నిర్లక్షం చేసిన విషయం తెలిసిందే. అయ్యప్పమాలతో అసభ్యంగా ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఫేస్ బుక్ ఫోటోలు

ఫేస్ బుక్ ఫోటోలు

అయ్యప్పస్వామి మాల వేసుకుని, అయ్యప్పస్వామి భక్తులు వేసుకునే దుస్తులు, రుద్రాక్షలు వేసుకుని అసహ్యంగా తీసుకున్న ఫోటోలను రెహనా ఫాతిమా తన ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో వివాదానికి దారి తీసింది. రెహనా ఫాతిమా ఫోటోలు వివాదం కావడం, ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శబరిమల సంరక్షణ కమిటి

శబరిమల సంరక్షణ కమిటి

రెహనా ఫాతిమా ఫేస్ బుక్ లో పోస్టు చేసిన అసభ్య ఫోటోలు గురించి తెలుసుకున్న శబరిమల సంరక్షణ కమిటి కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనేక ఫిర్యాదులు రావడంతో రెహనా ఫాతిమా మీద ఐపీఎస్ సెక్షన్ 295 (ఎ) కింద కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేశారు.

ఆఫీస్ లో అరెస్టు

ఆఫీస్ లో అరెస్టు

తన మీద కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న రెహనా ఫాతిమా కోర్టులో ముందుస్తు బెయిల్ కు అర్జీ సమర్పించింది. రెహనా ఫాతిమా సమర్పించిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్ మంజూరు కాకపోవడంతో మంగళవారం రెహనా ఫాతిమా పని చేస్తున్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోనే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

ఫాతిమా సస్పెండ్

ఫాతిమా సస్పెండ్

బీఎస్ఎన్ఎల్ సంస్థలో రెహనా ఫాతిమా టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తున్నది. కేరళలో జరిగిన కిస్ ఆఫ్ లవ్ అనే కార్యక్రమంలో పాల్గోన్న రెహనా ఫాతిమా తీవ్రవివాదానికి కారణం అయ్యింది. అయ్యప్పస్వామి దర్శనం చేసుకుంటానని, ఎవ్వరిమాట వినేదిలేదని రచ్చకెక్కిన రెహనా ఫాతిమాను ఎర్నాకులం కేంద్ర ముస్లీం జమాత్ మతం నుంచి బహిష్కరించింది, హిందూ సాంప్రధాయాలను అవమానించారని ఆరోపిస్తూ రెహనా ఫాతిమాను ముస్లీం మతం నుంచి బహిష్కరిస్తున్నామని జమాత్ పరిషత్ అధ్యక్షుడు పూకుంజు ప్రకటించారు. ఇన్ని వివాదాలకు కారణం అయిన రెహనా ఫాతిమాను బదిలి చేసిన బీఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పుడు ఏకంగా ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.

సినిమాల్లో అర్ద నగ్నంగా !

సినిమాల్లో అర్ద నగ్నంగా !

కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమంలో పాల్గొని, సినిమాల్లో అర్దనగ్నం నటించి, అయప్పస్వామి మాలతో అసభ్య దుస్తులు ధరించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన రెహనా ఫాతిమా మీద కఠిన చర్యలు తీసుకోవాలని పలు హిందూ సంఘ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ సాంప్రధాయాలను కించిపరిచారని ఆరోపిస్తూ ఇప్పటికే ఆమెను ముస్లీం మతం నుంచి బహష్కరించారని, ఇలాంటి వారి వలన సమాజంలో అలర్లు జరిగే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. రెహనా ఫాతిమా పోటోలు చూసిన పలువురు ఆమె తీరుపై మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+