కేరళ నటిపై లైంగిక దాడి: తేలిగ్గా కొట్టేసిన సిపిఎం నేత
నటిపై జరిగిన లైంగిక దాడిని సిపిఎం నేత తేలిగ్గా కొట్టేయడానికి ప్రయత్నించారు. భావనపై జరిగిన దాడి ఒక్కటి మాత్రమేనని, మిగతా అంతా సజావుగా ఉందని ఆయన అన్నారు.
కొచ్చి: కేరళ నటిపై జరిగిన దాడిని సిపిఎం నేత కొడియేరి బాలకృష్ణన్ తేలిగ్గా కొట్టేయడానికి ప్రయత్నించారు. కేరళలో నటిపైపై జరిగిన దాడిని పెద్ద చేయడం సరికాదని, రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇదొక్కటేనని ఆయన అన్నారు. ఆదివారంనాడు సినీ పరిశ్రమకు చెందినవారు నటికి మద్దతుగా ఆదివారంనాడు ప్రదర్శన నిర్వహించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సజావుగానే ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ అన్నారు. నటిపై సంఘటన ఒక్కటి మాత్రమేనని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి చెడిపోలేదని ఆయన అన్నారు. యుడిఎఫ్ పాలనలో కన్నా ఇప్పుడు శాంతిభద్రతలు బాగున్నాయని ఆయన అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనల జాబితాను ముందు పెడుతూ రాష్ట్రంలో పరిస్థితి ప్రస్తుతం సజావుగా ఉందని చెప్పడానికి ఆయన తిప్పలు పడ్డారు. మీడియా ప్రతినిధులు ఆయనను నటిపై సంఘటన గురించి ప్రశ్నించినప్పుడు - గత పాలనలోని గణాంకాలతో ఇప్పటి గణాంకాలను పోల్చి చెబుతూ పరిస్థితి బాగుందని అన్నారు .
నటిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ముఠాతో చేతులు కలిపిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు వేగంగా ప్రతిస్పందించి, నిందితులను అరెస్టు చేశారని ఆయన కొనియాడారు. దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications