Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళయాలం నటిపై లైంగిక దాడి: హీరో దిలీప్ మాజీ భార్య మంజు విచారణ, దిలీప్ గురించి !

మళయాలం నటిపై సామూహిక లైంగిక దాడి కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు పలువురు మళయాల సినీ ప్రముఖులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

కొచ్చి: మళయాలం నటిపై సామూహిక లైంగిక దాడి కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు పలువురు మళయాల సినీ ప్రముఖులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. తాజాగా గురువారం మరో ముగ్గురు సినీ పరిశ్రమకు చెందిన వారిని పోలీసు అధికారులు విచారణ చేశారని తెలిసింది.

నటిపై సామూహిక లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మళయాలం హీరో దిలీప్ మాజీ భార్య, నటి మంజు వారియర్ గురువారం కేరళ పోలీసు క్లబ్ చేరుకుని అధికారులు అడిగిన ప్రశ్నలకు పూర్తి వివరణ ఇచ్చారని కేరళకు చెందిన ప్రముఖ మంగళం టీవీ న్యూస్ చానల్ వార్తలు ప్రసారం చేసింది.

పల్సర్ సునీ ఏం చెప్పాడు ?

పల్సర్ సునీ ఏం చెప్పాడు ?

మళయాలం నటి సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు పల్సర్ సునీ ఇచ్చిన సమాచారం మేరకు కేరళ పోలీసులు విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే మళయాల సినీరంగానికి చెందిన అనేక మందిని పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.

దిలీప్ మాజీ భార్య మంజు

దిలీప్ మాజీ భార్య మంజు

మళయాల ప్రముఖ హీరో దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ గురువారం కేరళ పోలీసు క్లబ్ చేరుకుని ఏడీజీపీ, సీనియర్ మహిళా ఐపీఎష్ అధికారి బి. సంధ్య ముందు హాజరైనారని ప్రముఖ మళయాల టీవీ చానల్ మంగళం పదేపదే వార్తలు ప్రసారం చేసింది.

Recommended Video

    మంజు వారియర్ కు ఆ నటికి లింక్

    మంజు వారియర్ కు ఆ నటికి లింక్

    మళయాలం హీరో దిలీప్ 17 ఏళ్లు నటి మంజు వారియర్ తో కాపురం చేశారు. తరువాత మంజు వారియర్ కు విడాకులు ఇచ్చిన దిలీప్ మరో నటి కావ్య మాధవన్ ను వివాహం చేసుకున్నాడు. మంజు వారియర్ కు విడాకులు ఇచ్చే సమయంలో ఆమెకు అప్పట్లో లైంగిక దాడికి గురైన నటి మద్దతుగా నిలిచారు.

    బుద్ది చెప్పాలని

    బుద్ది చెప్పాలని

    మంజు వారియర్ కు మద్దతుగా నిలిచి బహిరంగంగా మీడియాతో మాట్లాడిన నటికి తగిన బుద్ది చెప్పాలని కొందరు ప్లాన్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ ప్లాన్ ప్రకారమే షూటింగ్ ముగించుకుని ఇంటికి వెలుతున్న నటిని కారులో కిడ్నాప్ చేసి అదే వాహనంలో సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

    మంజు వారియర్ ఏం చెప్పారు ?

    మంజు వారియర్ ఏం చెప్పారు ?

    గురువారం కేరళ పోలీసు క్లబ్ కు వెళ్లిన హీరో దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ పోలీసు అధికారులకు ఏం చెప్పారు ? అంటూ ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. తన మాజీ భర్త దిలీప్ ఎలాంటి వాడు ? లైంగిక దాడికి గురైన నటి విషయంలో ఏం చెప్పారు ? అంటూ ఎవరికి తోచినట్లు వారు చర్చించుకుంటున్నారు.

    కేసుతో నాకేంటి సంబంధం

    కేసుతో నాకేంటి సంబంధం

    నటి లైంగిక దాడి కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని మళయాలం నటుడు, నిర్మాత ధర్మరాజ్ అంటున్నారు. ధర్మరాజ్ కు ఈ కేసులో సంబంధం ఉందని కేరళలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్బంలో స్థానిక మీడియాతో మాట్లాడిన ధర్మరాజ్ నాకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు.

    యంగ్ డైరెక్టర్ కు లింక్ ?

    యంగ్ డైరెక్టర్ కు లింక్ ?

    నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో యళయాల చిత్ర పరీశ్రమకు చెందిన ఓ ప్రముఖ యంగ్ డైరెక్టర్ కు లింక్ ఉందని గురువారం వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు ? ఆ నటి మీద ఎందుకు అంత కక్ష ? ఎవరు చెబితే స్కెచ్ వేశారు ? అంటూ ఆరా తీస్తున్నారు.

    జైల్లో పల్సర్ సునీ చేతిలో మొబైల్ !

    జైల్లో పల్సర్ సునీ చేతిలో మొబైల్ !

    నటి లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రముఖ నిందితుడు పల్సర్ సునీ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే జైల్లో ఉన్న పల్సర్ సునీ అక్కడి నుంచి మొబైల్ లో అనేక మంది ప్రముఖులతో మాట్లాడాడని కేరళ పోలీసు అధికారులు గుర్తించారు. జైల్లోకి మొబైల్ ఎవరు తీసుకెళ్లి పల్సర్ సునీ చేతికి ఇచ్చారు ? అంటూ విచారణ మొదలు పెట్టారు.

    పల్సర్ సునీ రివర్స్ గేర్ !

    పల్సర్ సునీ రివర్స్ గేర్ !

    నటి లైంగిక దాడి కేసు విచారణలో ఇంత కాలం పోలీసుల విచారణకు సహకరించిన పల్సర్ సునీ ఇప్పుడు రివర్స్ గేర్ వేస్తున్నాడని సమాచారం. పోలీసుల విచారణకు సహకరించకుండా పల్సర్ సునీ తిక్కతిక్కగా సమాధానాలు ఇస్తున్నారని వెలుగు చూసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+