చరిత్ర తిరగరాయనున్న ఎల్‌డీఎఫ్.. ఏబీపీ-సీఓటర్,చాణక్య,పీ-మార్క్,రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్) చరిత్ర తిరగరాయనుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కేరళలో గత మూడు దశాబ్దాల రాజకీయంలో ఏ పార్టీకి ప్రజలు వరుసగా రెండోసారి అవకాశం ఇవ్వలేదు. ఒకసారి ఎల్‌డీఎఫ్ గెలిస్తే మరోసారి యూడీఎఫ్ గెలవడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. అయితే పినరయి విజయన్ నేత్రుత్వంలోని ఎల్‌డీఎఫ్ ఈసారి కొత్త చరిత్ర సృష్టించనుందని... వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.
తాజాగా వెలువడ్డ ఏబీపీ న్యూస్-సీఓటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఎల్‌డీఎఫ్ కూటమి 71-77 స్థానాల్లో గెలుపొందనుంది. కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూడీఎఫ్ కూటమి 62-68 స్థానాలు గెలుచుకోనుంది. బీజేపీ సున్నా లేదా కేవలం 2 స్థానాలకు పరిమితం కానుంది.

న్యూస్ 24-టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం... ఎల్‌డీఎఫ్ 104-120 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూడీఎఫ్ కూటమి కేవలం 20-36 స్థానాలకే పరిమితం కానుంది. బీజేపీ కేవలం 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.
పీ-మార్క్(P-MARQ) ఎగ్జిట్ పోల్ ప్రకారం... ఎల్‌డీఎఫ్ 72-79 స్థానాల్లో,యూడీఎఫ్ 60-66,బీజేపీ 0-3,ఇతరులు 0-1 స్థానాల్లో గెలుపొందనున్నారు.
రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం... ఎల్‌డీఎఫ్ 72-80 స్థానాల్లో,యూడీఎఫ్ 58-64,బీజేపీ 1-5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన కేరళ పంచాయతీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ జయకేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే. మొత్తం 941 పంచాయతీల్లో ఎల్డీఎఫ్ 514 పైచిలుకు స్థానాల్లో గెలుపొందింది. ఈ ఫలితాలు క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎల్‌డీఎఫ్ వైపే ఉన్నట్లు నిరూపించినట్లయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాల్లోనూ ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications