వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు: మహిళా న్యాయవాది సస్పెండ్

|
Google Oneindia TeluguNews

 FB post
తిరువనంతపురం: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో తన సహచర న్యాయవాదుల వ్యవహార తీరుపై ఇబ్బందికరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఓ యువ మహిళా న్యాయవాది(24) కోచికోడ్ బార్ కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యారు. గత అక్టోబర్ నెలలో ఈ వ్యాఖ్యలు చేసిన మహిళా న్యాయవాది అనిమా ముయరాత్‌ను కోజికోడ్ బార్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది.

పేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి దుష్ప్రవర్తకు పాల్పడినట్లు భావించి మహిళా న్యాయవాదిని సస్పెండ్ చేసినట్లు బార్ కౌన్సిల్ తెలిపింది. తమ చర్య పట్ల ఏదైనా అభ్యంతరం చెప్పాలనుకుంటే అప్పీల్ చేసుకోవచ్చని బార్ కౌన్సిల్ పేర్కొంది.

ఫేస్‌బుక్‌లో న్యాయవాది అనిమా ముయరాత్ మళయాళంలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. బార్ కౌన్సిల్‌లో, కోర్టు ఆవరణలో తన సహచర న్యాయవాదుల వ్యవహార శైలి చాలా సిల్లీగా ఉందనిపేర్కొన్నారు. వారి వ్యవహార శైలిని ఓ పాత సినిమాను పోల్చుతూ కామెంట్లు చేసింది. షుగర్ క్యాండీ, అందంగా ఉన్నావని అంటూ ఆకట్టుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కార్యాలయంలోకి వచ్చే ప్రతీ కొత్త మహిళ సోదరి లేదా ప్రియురాలు కావాలని కోరుకుంటారని, ఈ విధంగా పురుషులు ఎందుకు దిగజారిపోతున్నారని కూడా ఆమె ప్రశ్నించారు.

కాగా అనిమాపై బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనిమాకు మద్దతుగా నిలిచి, ఆమెపై చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన పట్ల కొందరు ప్రవర్తించిన తీరుపై తాను వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని, తాను వారి పేర్లు కూడా బహిర్గతం చేయలేదని, ఇది బార్ కౌన్సిల్ ప్రతిష్టను ఏ విధంగా భంగం కలిగిస్తుందో తెలియడం లేదని అనిమా అన్నారు. తను హాజరుకాని సమయంలో తనపై చర్యలు తీసుకోవడం సరికాదని, తన వాదనను వినేందుకు సమయం ఇవ్వాలని అనిమా కోరారు.

English summary
A young woman lawyer from Kozhikode, who posted on Facebook about the silly, irritating behaviour of her male colleagues, had to face the ire of Kozhikode Bar Council. The Bar council suspended the 24-year-old lawyer, Anima Muyarath, for the Facebook post written in October last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X