కేరళ తగ్గని కరోనా ఉధృతి: 32వేలకుపైగా కొత్త కరోనా కేసులు, డొంట్‌వర్రీ అంటూ మంత్రి వీణా జార్జ్
తిరువనంతపురం: కేరళలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. దేశంలో సగం కొత్త కేసుల కంటే ఎక్కువ ఇక్కడే నమోదవుతుండటం గమనార్హం. వరుసగా మూడోసారి కూడా కేరళ రాష్ట్రంలో 30వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వందకుపైగా మరణాలు నమోదయ్యాయి. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వ్యాఖ్యలు మాత్రం ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

కేరళలో కొత్తగా 32,801 కరోనా కేసులు, 179 మరణాలు
కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 32,801 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 179 మంది మరణించారు. తాజాగా, నమోదైన 179 మరణాలతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 20,313కు చేరింది. ఇక గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 18,573 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 19.22 శాతం ఉంది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ,95,254 యాక్టివ్ కేసులున్నాయి.

డొంట్‌వర్రీ అంటూ కేరళ మంత్రి వీణా జార్జ్
అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగినప్పటికీ.. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ శుక్రవారం మీడియాతో వ్యాఖ్యానించారు. కరోనా కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కరోనా నిబంధనలను ప్రజలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా ఉండాలని సూచించారు.

ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లు సగం ఖాళీగానే..
మే నెలలో రోజువారీ కేసులు 40వేలకుపైగా ఉన్నప్పటికీ.. అందరికీ వైద్యం అందించామని ఆరోగ్యమంత్రి తెలిపారు. ఐసీఎంఆర్ సెరో-పర్వలెన్స్ ఒక ముఖ్యమైన ప్రమాణంగా ఉంటుంది. దాని ప్రకారం, కేరళ జనాభాలో 50 శాతం కంటే తక్కువ మంది ఈ వైరస్ బారిన పడ్డారు "అని కేరళ ఆరోగ్య మంత్రి తెలిపారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ.. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వీణా జార్జ్ తెలిపారు. ఐసీయూ, వెంటిలేటర్లపై వైద్య చికిత్స పొందుతున్నవారి సంఖ్య 50 శాతం కంటే తక్కువగానే ఉందన్నారు. కేరళలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని మంత్రి తెలిపారు.
Recommended Video

టెస్టింగ్, వ్యాక్సినేషన్‌లోనే ముందున్నామన్న మంత్రి వీణా జార్జ్
దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రాలలో కేరళ ఒకటని తెలిపారు. 'అలాగే, మా అండర్-రిపోర్టింగ్ కారకం దేశంలో అతి తక్కువ: 1: 6. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇది 1: 100, ఇంకా ఎక్కువ' అని వీణా జార్జ్ అన్నారు. టీకా ముందు గురించి వీణా జార్జ్ మాట్లాడుతూ... "మేము 18 ఏళ్లు పైబడిన జనాభాలో 70.24 శాతం మందికి మొదటి డోస్ అందించాము." అని అన్నారు. కేరళ ఇప్పటికే భారీ వ్యాక్సిన్ డ్రైవ్‌లను ప్రారంభించిందని, కేంద్రం కూడా రాష్ట్రానికి మరిన్ని టీకాలను కేటాయించిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. కేరళలో కరోనా ఉధృతిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా గత వారంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 58.4 శాతం ఒక్క కేరళలోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 3.33 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. వాటిలో లక్షన్నరకు పైగా(51శాతం) ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయని వెల్లడించారు. దేశంలో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్న ఏకైక రాష్ట్రం కేరళనే కావడం గమనార్హం. గత 24 గంటల్లో 30వేలకుపైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications