మూడు రోజులు భారీ వర్షాలు- ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో బారీ వర్షాలు పడుతున్నాయి. గురువారం పలు జిల్లాల్లో భారీ వానలు పడగా.. మరో మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీతో పాటుగా తెలంగాణలోనూ అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు.. పిడుగలతో కూడిన వర్షాల పైన తాజాగా హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఈ రోజు నుంచి మూడు రోజుల పాటుగా ఏపీ, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు 26వ తేదీన అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమగోదావరి, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక మిగతా జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశముందని, పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, శుక్రవారం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అయితే, గడిచిన 24 గంటల్లో పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో 5.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది.

 AP EAPCET-2026 ఫలితాల డేట్ వచ్చేసింది, అఫీషియల్..!!
AP EAPCET-2026 ఫలితాల డేట్ వచ్చేసింది, అఫీషియల్..!!
IMD issues alerts over Rains in many parts of Andhra Pradesh and Telangana in next three days here the details

మూడు రోజులు వర్షాలు

అదే విధంగా కృష్ణా జిల్లా గుడివాడలో 3.5 సె.మీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో 3.5 సె.మీ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 3.3 సె.మీ, ఏలూరు జిల్లా భీమడోలులో 3 సె.మీల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఇక ఏలూరు జిల్లా కైకలూరులో 2.9 సెంటీ మీటర్లు, విజయనగరంలో 2.7 సె.మీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురంలో 2.6 సె.మీ, ఎన్టీఆర్ జిల్లా పాలేరు బ్రిడ్జి 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. కాగా,
ఇక రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఈదురుగాలులు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయిని తెలిపింది. అటు తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. జూన్ 26,278వ తేదీల్లో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+