రేప్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోలీసు కస్టడీకి, బెండ్ తీస్తారా ? ఒప్పుకుంటాడా ?

ఆంటీని రేప్ చేసిన కేసులో అరెస్టు అయిన కాంగ్రెస్ పార్టీ కేరళ ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ కు సినిమా కష్టాలు మొదలైనాయి. 51 ఏళ్ల వివాహిత మహిళ, సీపీఎం పార్టీ నాయకురాలిపై అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న

కొచ్చి: ఆంటీని రేప్ చేసిన కేసులో అరెస్టు అయిన కాంగ్రెస్ పార్టీ కేరళ ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ కు సినిమా కష్టాలు మొదలైనాయి. 51 ఏళ్ల వివాహిత మహిళ, సీపీఎం పార్టీ నాయకురాలిపై అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళలోని కోవలం శాసన సభ్యుడు ఎం. విన్సెంట్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

అత్యాచారం చెయ్యడంతో వివాహిత మహిళ అవమానంతో ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని, ఈ కేసు దర్యాప్తు నిమిత్తం రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ ను విచారణ చెయ్యడానికి కష్టడీకి ఇవ్వాలని కేరళ పోలీసులు తిరువనంతపురం కోర్టులో మనవి చేశారు.

Kerala Congress MLA M Vincent accused of rape sent to one day police custody

రేప్ కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక అధికారిణి, కోల్లం సిటీ పోలీసు కమిషనర్ ఎస్. అజితా బేగం మంగళవారం తిరువనంతపురం కోర్టులో హాజరైనారు. ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ ను కష్టడీకి ఇవ్వాలని అజితా బేగం కోర్టులో మనవి చేశారు. పోలీసులు ఈ కేసు వివరాలు పూర్తిగా కోర్టులో వివరించారు.

కేసు వివరాలు తెలుసుకున్న తిరువనంతపురం న్యాయస్థానం ఒక్క రోజు విచారణ చెయ్యడానికి ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ ను కష్టడీలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ ను అదుపులోకి తీసుకుని కోల్లం సిటీ పోలీసు కమిషనర్ అజితా బేగం ఆధ్వర్యంలో విచారణ మొదలు పెట్టారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల లోపు ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ ని మళ్లీ తిరువనంతపురం కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+