ప్రముఖ నటి మంజూపై అసభ్య వ్యాఖ్యలు: పోలీస్ సస్పెండ్
కోచి: మలయాళీ సినీ నటిపై ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన కామెంట్లు పోస్ట్ చేసిన ట్రైనీ పోలీస్ అధికారి సస్పెండ్‌కు గురయ్యారు. ప్రముఖ మళయాళ నటి మంజూ వారియర్‌పై ట్రైనీ పోలీస్ అధికారి కేఎం రెంజుమన్ ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన కామెంట్లు పోస్ట్ చేశాడు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంజూ వారియర్ కేరళ డీజీపీ టీపీ సేన్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ట్రైనీ అధికారి రెంజుమన్.. మంజూ వారియర్ నటుడు సూరజ్ వెంజరమూద్‌తో కలిసి ఉన్న ప్రమోషనల్ ఫొటోతోపాటు అసభ్యకరమైన కామెంట్లు పోస్ట్ చేశాడు.

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన డీజీపీ సేన్ కుమార్.. ట్రైనీ అధికారి రెంజుమన్‌ని సస్పెండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై మంజూ వారియర్ మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.












Click it and Unblock the Notifications