వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kerala Election Results 2021: కోటపై మళ్లీ ఎర్రజెండా? ఆధిక్యతలో మేజిక్ ఫిగర్ క్రాస్: మెట్రోమ్యాన్ లీడింగ్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలో మరోసారి కమ్యూనిస్టులు ఎర్రజెండాను ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రారంభ ఫలితాల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) దూసుకెళ్తోంది. ఆధిక్యతలో- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అందుకుంది కూడా. వంద సీట్ల మార్క్‌‌ను అలవోకగా అందుకునేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వహిస్తోన్న యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోతోంది.

లోక్‌సభ స్థానాలను క్వీన్‌స్వీప్ చేసిన యూడీఎఫ్.. అసెంబ్లీ ఎన్నికల వద్దకు వచ్చేసరికి చతికిల పడిందనే విషయాన్ని ప్రారంభ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ముందంజంలో కొనసాగుతోంది. ఎల్డీఎఫ్ 90, యూడీఎఫ్ 46 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. బీజేపీ మూడు చోట్ల, ఇతరులు ఒక స్థానంలో లీడ్‌లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన మెట్రోమ్యాన్ శ్రీధరన్ ముందంజలో ఉన్నారు.

Kerala Election Results 2021: Early Trends Show LDF likely to retain the power

పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి, సీపీఎం అభ్యర్థి సీపీ ప్రమోద్‌పై 2,500 ఓట్ల తేడాతో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. పాలక్కాడ్ సహా మరో రెండు నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యతను కనపరుస్తోంది. మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. అయినప్పటికీ- ఆయన అంచనాలకు మించి రాణిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టిపోటీ నెలకొంది.

Recommended Video

Exit Poll 2021:West Bengal, Tamil Nadu, Kerala, Assam, Puducherry Exit Poll Results| Oneindia Telugu

బీజేపీ దాని మిత్రపక్షాలు ఏడు చోట్ల.. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఆరు చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. రౌండ్ రౌండ్‌కూ ఇక్కడ ఫలితాలు తారుమారు అవుతున్నాయి. తమిళనాడులో డీఎంకే ఆధిక్యత కొనసాగుతోంది. డీఎంకే-108, ఏఐఏడీఎంకే 75 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీథి మయ్యం ఒక్క చోట మాత్రమే లీడింగ్‌లో ఉంటోంది. ప్రధానపోటీ డీఎంకే-అన్నాడీఎంకే మధ్యే అనేది మరోసారి స్పష్టమైంది.

English summary
Early Trends Show LDF likely to retain the power in Kerala. Since Kerala is the only Left-ruled state in the country and Congress leader Rahul Gandhi led the Kerala campaign for Congress, these elections are important for the political future of both parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X