Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేరళ వరదలు: వీపునే మెట్టుగా మార్చిన మత్స్యకారుడు, ప్రశంసల జల్లు

Recommended Video

    కేరళ వరదలు: మత్స్యకారుడుపై కురుస్తున్న ప్రశంసల జల్లు...!

    తిరువనంతపురం: కేరళ వరద బాధితులను ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్‌లతో పాటు మత్స్యకారులు, ఆరెస్సెస్ కూడా సహాయం అందిస్తోంది. వరద బాధితులను ఆదుకునేందుకు టోపీ లేని మత్స్యకారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యంతో పాటు స్థానిక మత్స్యకారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    చదవండి: కేరళ వరదలు: రూ.12వేల కోట్ల పేటీఎం అధినేత విరాళం రూ.10వేలు

    మత్స్యకారులు కూడా ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతున్నారు. ఓ వృద్ధురాలిని కాపాడేందుకు ఓ మత్స్యకారుడు తన వీపునే మెట్టుగా మార్చాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి అతడు అందించాడు. తనూర్‌కు చెందిన జైసల్‌ కేపీ మత్స్యకారుడు. చిన్నపిల్లతో పాటు వరదల్లో చిక్కుకున్న ఓ తల్లి, వృద్ధురాలి ఆచూకీలను కనిపెట్టడంలో ఈయన ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు తోడ్పడ్డారు.

    అనంతరం వృద్ధురాలిని పడవలోకి ఎక్కించేందుకు ఆ మత్స్యకారురుడు తన వీపును మెట్టుగా మార్చాడు. వరద నీళ్లలో మోకాళ్లపై ఆయన ముందుకు వంగాడు. ఆయనపైకి ఎక్కి ఆమె పడవలోకి చేరుకారున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు మత్స్యకారుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    Kerala fisherman bends down to pave way for women to get into rescue boat, lauded

    కేరళ వ్యాప్తంగా దాదాపు 600 మంది మత్స్యకారులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

    కేరళకు రైళ్లలో నీరు, ఆహారం, మందులు

    నైరుతి రైల్వే అధికారులు నీరు, ఆహారం, బిస్కెట్లు, ఔషధాలను పంపేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థుల బృందం వీటిని తీసుకుని వెళుతోంది. మొత్తం 23 టన్నుల ఆహారం నేటి మధ్యాహ్నానికి కేరళ చేరుకుంటుంది. మరో రైలును కూడా పంపనున్నామని పేర్కొన్నారు. ఈ రైళ్లలో బియ్యం, రవ్వ, గోధుమ పిండి, నూనె, నీరు, ఉల్లిపాయలు, పప్పు, టీ పొడి, పాలు, పాలపొడి, చక్కెర, దుప్పట్లు తదితరాలు ఉన్నాయని తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+