ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్య, విజయన్‌కు రాజ్‌నాథ్ ఫోన్
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటనపై కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేశారు.
తిరువనంతపురం: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటనపై కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేశారు. మరో వైపు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
34 ఏళ్ళ రాజేష్ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు దాడి చేశారు. అయితే ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై బిజెపి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

అయితే రాజేష్‌ను సిపిఎం కార్యకర్తలే హత్య చేశారని బిజెపి ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాతకక్షలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యమంత్రి విజయన్‌కు ఫోన్ చేశారు అయితే ఈ ఘటనకు పాల్పడినవారు ఎవరైనా చర్యలు తీసుకొంటామని హోంమంత్రికి విజయన్ సమాధానమిచ్చారు. ఈ మేరకు సిఎంఓ తెలిపింది.
మరో వైపు ఈ ఘటనకు కారకులుగా అనుమానిస్తున్న ఐదుగురు సిపిఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.
-
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!!












Click it and Unblock the Notifications