రూ.700 కోట్లు ఇస్తామని మేం చెప్పలేదు: కేరళ సీఎంకు యూఏఈ భారీ షాక్

తిరువనంతపురం/యూఏఈ: కేరళ రాష్ట్రానికి రూ.700 కోట్ల సాయం ప్రకటనను యూఏఈ (యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్) ఖండించింది. కేరళకు నిర్ధిష్ట సాయం చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, ప్రకటించలేదని తెలిపింది. అసలు కేరళకు సాయం ఎంత అనేది కూడా తాము నిర్ణయించలేదని చెప్పింది. కేరళకు సాయం విషయంలో మేం అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని చెప్పారు.

Recommended Video

    యూఏఈ సహాయంపై స్పందించిన కేంద్రమంత్రి....!

    ఈ మేరకు యూఏఈ అంబాసిడర్ అహ్మద్ అల్బన్నా శుక్రవారం ప్రకటన చేశారు. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడి రూ.700 కోట్ల సాయం ప్రకటనను ఖండించారు.

    Kerala floods: UAE denies Rs 700 crore aid, says nothing announced yet

    కేరళకు సాయంపై తాము ఎలాంటి సహాయం ప్రకటన చేయలేదని ఆయన చెప్పారు. కేరళలో వరద సాయంపై అంచనా కొనసాగుతోందని తెలిపారు. ఆర్థిక సాయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

    యూఏఈ రూ.700 కోట్ల మొత్తాన్ని కేరళకు సహాయంగా ప్రకటించలేదా అని ప్రశ్నిస్తే.. 'అవును, అది నిజం, దాని పైన మేం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అసలు మేం దానిని ప్రకటించలేదు' అని చెప్పారు.

    యూఏఈ అంబాసిడర్ వ్యాఖ్యలు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు, ఇతరులకు పెద్ద షాక్ అని అంటున్నారు. గత ప్రభుత్వాలు కూడా విదేశీ సహాయాన్ని తీసుకోలేదు. భారతదేశం సౌలభ్యం దృష్ట్యా మోడీ ప్రభుత్వం కూడా అదే పరంపరను కొనసాగిస్తోంది.

    అయితే, రూ.700 కోట్లను యూఏఈ ప్రకటించిందని కేరళ సీఎం చెప్పడం, దానిని అంగీకరించాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, ఆయనకు పలువురు వంత పాడటం జరిగింది. వారందరికీ ఇది పెద్ద షాక్ అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+