Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Water Diet: 'అనోరెక్సియా నెర్వోసా' వ్యాధితో కేరళ యువతి మృతి.. దాని లక్షణాలు తెలుసా?

Water Diet: బరువు పెరుగుతానన్న భయంతో దాదాపు 6 నెలల పాటు నీరే ఆహారంగా తీసుకుని బతికిన 18 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేరళ అనోరెక్సియా నెర్వోసా అనే వ్యాధితో బాధపడుతున్న 18 ఏళ్ల అమ్మాయి థలస్సేరి కో-ఆపరేటివ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మేరువంబైకి చెందిన శ్రీనంద దాదాపు ఆరు నెలలుగా ఆహారం తీసుకోకుండా నీటితో మాత్రమే జీవించిందని తెలుస్తోంది. ఆమె ఆన్ లైన్ పోర్టల్స్ లో చెప్పే బరువు తగ్గే చిట్కాలను పాటిస్తూ వచ్చింది. ఇది ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 12 రోజుల క్రితం ఆమెను ఆస్పత్రిలోని ఐసీయూ లో చేర్చారు.

ఆమె 24 కిలోల బరువు కూడా లేదని.. పూర్తిగా మంచం పట్టిందని ఆస్పత్రిలోని ఒక కన్సల్టెంట్ వైద్యుడు చెప్పారు. ఆమె షుగర్ లెవెల్స్, సోడియం, రక్తపోటు చాలా దారుణంగా పడిపోయాయి. అనంతరం ఆమెను వెంటిలేటర్ పై ఉంచారు.. కానీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. ఆమె వైద్యానికి కోలుకోకపోవడంతో మృతి చెందింది. ఆమె అనోరెక్సియా నెర్వోసా అనే రుగ్మతతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇది తీవ్రంగా బరువు తగ్గడానికి, అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Kerala Girl Dies from Anorexia Nervosa Learn About the Symptoms

అనోరెక్సియా నెర్వోసా అంటే ఏమిటి?
జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం.. అనోరెక్సియా నెర్వోసా అనేది ఏది తినకుండా, అధిక బరువు తగ్గడం ద్వారా వచ్చే తీవ్రమైన రుగ్మత. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు బరువు పెరుగుతామనే తీవ్రమైన భయం వల్ల ఏది తినకపోవడం వల్ల తక్కువ బరువు ఉంటారు. దీని వల్ల వారు తమ ఆహారాన్ని పరిమితం చేసుకుంటారు. అంటే కనీసం భోజనం కూడా చేయరు.

అనోరెక్సియా నెర్వోసా లక్షణాలు

*తీవ్రమైన ఆహార పరిమితి: అనోరెక్సియా నెర్వోసా ఉన్నవారు తాము తీసుకునే ఆహారాన్ని తీవ్రంగా పరిమితం చేస్తారు. తీసుకునే ఆహారంలో ఎక్కువగా కేలరీలను లెక్కిస్తూ ఉంటారు.

*బరువుగా దారుణంగా పడిపోవడం: తక్కువ బరువు ఉన్నప్పటికీ వారు తమను తాము అధిక బరువుతో ఉన్నామని భావిస్తారు. ఎప్పుడూ శరీర ఆకారం, పరిమాణంపై తమ మనస్సును లగ్నం చేస్తారు.

*బరువు పెరుగుతామనే తీవ్ర భయం: బరువు పెరుగామనే భయం నిరంతరం వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో వారు కఠిన ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు.

అనోరెక్సియా నెర్వోసా పరిణామాలు
అనోరెక్సియా నెర్వోసా అనేది ప్రాణాంతక వ్యాధి. ఇది మానసిక అనారోగ్యాలలో అత్యధిక మరణాల రేటును కలిగి ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ తెలిపింది. తీవ్రమైన ఆకలి ప్రాణాంతక వైద్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే మానసిక ఒత్తిడి ఆత్మహత్య చేసుకోవడంలో ప్రధాన కారణంగా నిలుస్తుంది.

శారీరక పరిణామాలు
*గుండె సంబంధ సమస్యలు: ఆకలితో ఉండడం వల్ల తక్కువ రక్తపోటు, క్రమరహిత గుండెలయలు, గుండె వైఫల్యం వంటి గుండె సంబంధ సమస్యలు వస్తాయి.

*ఎముకల ఆరోగ్యం: దీర్ఘకాలిక పోషకాహార లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ రావచ్చు. పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

*అవయవ వైఫల్యం: తీవ్రమైన కేసులో మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలు పనిచేయకుండా పోవచ్చు.

అనోరెక్సియా నెర్వోసా హెచ్చరిక సంకేతాలు
అనోరెక్సియా నెర్వోసా తరచుగా క్రమంగా అభివృద్ధి చెందుతుంది. తీవ్రమైన లక్షణాలు కనిపించే ముందు హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి.
క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ప్రకారం సాధారణ హెచ్చరిక సంకేతాలు ఇవే..
*డైటింగ్, కేలరీలు, శరీర బరువు గురించి నిరంతరం ఆందోళన చెందడం.
*తక్కువ బరువు ఉన్నప్పటికీ లావుగా ఉన్నట్లు తరచుగా ఫిర్యాదు చేయడం.
*స్నేహితులను కలవకపోవడం, అందరూ కలిసి ఆనందించే కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం.
*ఆహారం తీసుకోవడం గురించి అబద్ధం చెప్పడం లేదా రహస్యంగా భోజనం దాటవేయడం .
*ఇతరుల ముందు తినడానికి ఆత్రుతగా లేదా ఇబ్బందిగా అనిపించడం.
*కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వులు వంటివి లభించే ఆహారాలను నివారించడం.
*ఆకలితో ఉన్నప్పుడు కూడా ఆకలిగా లేనట్లు నటించడం.
*కఠినమైన వ్యాయామ షెడ్యూల్ కు కట్టుబడి ఉండటం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+