ఆల్ టైమ్ రికార్డ్... కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ శైలజా టీచర్‌దే...
నలభై దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ కేరళలో వరుసగా రెండోసారి ఎల్‌డీఎఫ్ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం(మే 2) వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎల్‌డీఎఫ్ కూటమి 91 స్థానాల్లో విజయం సాధించింది. ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ అందరి కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. మట్టన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయిలో 67,013 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం.
మంత్రి శైలజను చాలామంది శైలజ టీచర్ అని పిలుస్తుంటారు. గతంలో 23 ఏళ్ల పాటు ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2004లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ),సీపీఎం యూత్ విభాగంలో పనిచేశారు. 2016లో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తొలిసారిగా ఆమె మంత్రి అయ్యారు. అప్పటి ఎన్నికల్లో కుతుపరంబ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శైలజ... 12,291 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఏకంగా 60వేల పైచిలుకు మెజారిటీ సాధించారు.

64 ఏళ్ల ఈ మహిళా నేత 2017-2018లో కేరళను నిఫా వైరస్ వణికించిన సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి అంతర్జాతీ స్థాయిలో భేష్ అనిపించుకున్నారు.తాజా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎల్‌డీఎఫ్ తరుపున పాపులర్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. ఎన్నికల్లో విజయంపై ఫేస్‌బుక్‌లో స్పందించిన మంత్రి శైలజ...'ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించినందుకు మట్టన్నూర్ ప్రజలకు ధన్యవాదాలు..' అని పేర్కొన్నారు.
కేరళలో ఇప్పటివరకూ అత్యధిక మెజారిటీ 45,587 ఓట్లే కావడం గమనార్హం. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ కాంగ్రెస్ నేత పీజే జోసెఫ్‌కి ఈ మెజారిటీ దక్కింది. తాజా ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ 50వేల మెజారిటీతో గెలుపొందారు. ధర్మందం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.
రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను 99 స్థానాల్లో ఎల్‌డీఎఫ్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసింది. దీంతో కేరళలో కొత్త చరిత్ర సృష్టించినట్లయింది. గత నాలుగు దశాబ్దాలుగా కేరళలో ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతూ వస్తోంది. ఒకసారి ఎల్‌డీఎఫ్‌కు,మరోసారి యూడీఎఫ్‌కు ప్రజలు అవకాశం ఇస్తూ వస్తున్నారు. కానీ మొదటిసారి ఆ పరంపరను బ్రేక్ చేస్తూ వరుసగా రెండోసారి ఎల్‌డీఎఫ్ తమ అధికారాన్ని నిలుపుకుంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications