ప్రముఖ నటి కిడ్నాప్ లైంగిక దాడి: హీరో దిలీప్ బెయిల్, రిజర్వులో పెట్టిన కేరళ హైకోర్టు !
ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ స్టార్ హీరో దిలీప్ బెయిల్ పిటీషన్ విచారణ చేసిన కేరళ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. గురువారం కచ్చితంగా బెయిల్ వస్తోందని దిల
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ స్టార్ హీరో దిలీప్ బెయిల్ పిటీషన్ విచారణ చేసిన కేరళ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. గురువారం కచ్చితంగా బెయిల్ వస్తోందని దిలీప్ ఆశలు పెట్టుకున్నాడు.
దిలీప్ పెట్టుకున్న ఆశల మీద కేరళ పోలీసులు నీళ్లు చల్లారు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో కింగ్ పిన్ దిలీప్ అని గురువారం కేరళ హైకోర్టులో చెప్పారు. నటి లైంగిక దాడి కేసులో దిలీప్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు వ్యతిరేకంగా పోలీసుల దగ్గర ఎలాంటి సాక్షాలు లేవని హీరో దిలీప్ న్యాయవాది రామ్ కుమార్ హైకోర్టులో చెప్పారు.

ఫిబ్రవరి 17వ తేదిన నటిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన కేసులో హీరో దిలీప్ కు సంబంధం ఉందని, మాదగ్గర సాక్షాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ మొత్తం చెప్పాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.
నటుడు దిలీప్ నిందితుడు పల్సర్ సునీ, అతని గ్యాంగ్ తో ఫోన్ లో మాట్లాడాడని, ఆ పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని పోలీసు అధికారులు కోర్టులో మనవి చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సునీల్ థామస్ బెయిల్ పిటిషన్ విచారణ తీర్పును రిజర్వులో పెట్టారు.












Click it and Unblock the Notifications