కేరళ హౌస్ బీఫ్ కేసు: మేము రైడ్ చెయ్యలేదు, బస్సీ

న్యూఢిల్లీ: అందరూ అంటునట్లు ఢిల్లీ పోలీసులు కేరళ భవన్ (కేరళ హౌస్) మీద దాడి చెయ్యలేదని, శాంతి భద్రతలలో భాగంగా అక్కడికి వెళ్లామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీ.ఎస్. బస్సీ తెలిపారు. అయితే ఢిల్లీ పోలీసుల మీద బురద చల్లడానికి కొందరు లేనిపోని పుకార్లు పుట్టించారని విచారం వ్యక్తం చేశారు.

ఢిల్లీ నగర పోలీసు కమిషనర్ బస్సీ మీడియాతో మాట్లాడారు. కేరళ భవన్ లోని క్యాంటిన్ లో బీఫ్ వండి వడ్డిస్తున్నారని పోలీసు కంట్రోల్ రూంకు తప్పుడు ఫోన్ కాల్ వచ్చిందని అన్నారు. మతపరమైన అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లిన మాట వాస్తవమే అన్నారు.

అయితే సమస్యులు తలెత్తకుండా చూడటానికి ముందు జాగ్రత్తగా పోలీసులు అక్కడికి వెళ్లారని, అందులో వేరే ఉద్దేశం లేదని బస్సీ స్పష్టం చేశారు. విష్ణుగుప్తా, అతని అనుచరులు కేరళ భవన్ లో ఏమైనా వివాదం సృష్టిస్తే అడ్డుకోవడానికి మాత్రమే పోలీసులు అక్కడికి వెళ్లారని అన్నారు.

Kerala House beef row case, Delhi Police Commissioner BS Bassi

బీఫ్ వండి వడ్డిస్తున్నారని పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన విష్ణుగుప్తా మీద పోలీసులు నిఘా వేశారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు విష్ణుగుప్తా మీద ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదని పోలీసు కమిషనర్ బస్సీ వివరించారు.

అయితే తప్పుడు ఫోన్ కాల్ చేసి పోలీసులను తప్పుదారి పట్టించిన విష్ణుగుప్తా మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ స్పష్టం చేశారు. బీఫ్ వండి వడ్డిస్తున్నారని కేరళ భవన్ లోని క్యాంటిన్ లో పోలీసులు సోదాలు చేశారని ఆరోపణలు రావడంతో పోలీసు కమిషనర్ బస్సీ వివరణ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+