Kerala: నరబలి ఎంత భయంకరంగా ఉంటే దేవుడు అంత అనుగ్రహిస్తాడు, శ్రీదేవి పేరుతో ఫేస్ బుక్ లో !

తిరువనంతపురం/కొచ్చి: కేరళలో జరిగిన మహిళల నరబలి కేసు విచారణ వేగవంతం అయ్యింది. నరబలి ఎంత భయంకరంగా ఉంటే దేవుడు అంత అనుగ్రహిస్తాడు అని మంత్రగాడు దంపతులను రెచ్చగొట్టి అతి కిరాతకంగా హత్యలు చేయించాడని వెలుగు చూసింది. మంత్రగాడు మోహమ్మద్ షఫీని నమ్ముకున్న నాటు వైద్యుడు భగవాల్ లాల్ ఇద్దరు మహిళలను అతని ఇంట్లోనే చంపేశాడు. పోలీసుల విచారణలో వైద్యుడు, అతని భార్య లైలా, మాంత్రికుడు చెబుతున్న సమాచారంతో పోలీసులు, సామాన్య ప్రజలు హడలిపోయారు. నరబలి ఇచ్చిన తరువాత మహిళల ప్రైవేట్ పార్ట్స్ ముక్కలు ముక్కలు చేసి వంట చేసుకుని తిన్నారని వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోయారు. మాంత్రికుడు మోహమ్మద్ షఫీ అతని భార్య మొబైల్ ఫోన్ లో శ్రీదేవి పేరుతో నకిలి ఫేస్ బుక్ అకౌంట్ ప్రారంభించి నాటు వైద్యుడు భగవాల్ సింగ్ కు వల వేశాడని పోలీసులు అన్నారు. భగవాల్ సింగ్ ను ఏ రకంగా ట్రాప్ లో పడేశాడు అని తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు.

మంత్రగాడి స్కెచ్

మంత్రగాడి స్కెచ్


కేరళలోని పతనంమిట్టలోని తిరువళ్లలో నివాసం ఉంటున్న నాటు వైద్యుడు భగవాల్ సింగ్ అలియాస్ డాక్టర్ భగవాల్ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటే అతన్ని క్యాష్ చేసుకోవాలని మంత్రగాడు మోహమ్మద్ షఫీ స్కెచ్ వేశాడు. పోలీసుల విచారణలో మోహమ్మద్ షఫీ మ్యాటర్ మొత్తం బయటకు వస్తోంది.

భార్య మొబైల్ ఫోన్ లో శ్రీదేవి పేరుతో ?

భార్య మొబైల్ ఫోన్ లో శ్రీదేవి పేరుతో ?

కేరళ నరబలి కేసులో పోలీసులు మంత్రగాడు మోహమ్మద్ షఫీకి చెందిన నకిలి ఫేస్ బుక్ అకౌంట్ గుర్తించారు. మాంత్రికుడు మోహమ్మద్ షఫీ అతని భార్య మొబైల్ ఫోన్ లో శ్రీదేవి పేరుతో నకిలి ఫేస్ బుక్ అకౌంట్ ప్రారంభించాడని, 2019లో ఇదే ఫేస్ బుక్ అకౌంట్ నుంచి నాటు వైద్యుడు భగవాల్ సింగ్ ను పరిచయం చేసుకున్నాడని పోలీసులు అన్నారు.

 కోరిక తీర్చాలని చెప్పే వరకు మ్యాటర్ వెళ్లింది

కోరిక తీర్చాలని చెప్పే వరకు మ్యాటర్ వెళ్లింది

మూడు సంవత్సరాల నుంచి శ్రీదేవి అనే పేరుతోనే మంత్రగాడు మోహమ్మద్ షఫీ నాటు వైద్యుడు భగవాల్ సింగ్ తో చాటింగ్ చేస్తూ అతని వ్యక్తిగత విషయాలు, ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకున్నాడు. చివరికి తన కోరిక తీర్చాలని భగవాల్ సింగ్ శ్రీదేవి పేరుతో చాటింగ్ చేస్తున్న మోహమ్మద్ షఫీకి చెప్పాడు. అంతలా భగవాల్ సింగ్ ను మోహహ్మద్ షఫీ లొంగదీసుకున్నాడు.

ముసలోడికి కత్తిలాంటి ఫిగర్ ను పంపించి ?

ముసలోడికి కత్తిలాంటి ఫిగర్ ను పంపించి ?

నాటు వైద్యుడు భగవాల్ సింగ్ ను లొంగదీసుకోవడాని మోహమ్మద్ షఫీ కొచ్చిలో కత్తిలాంటి సెక్స్ వర్కర్ ను సంప్రధించాడు. ఆమెను భగవాల్ సింగ్ దగ్గరకు పంపించి తానే శ్రీదేవి అని చెప్పించి ముసలోడి కోరిక తీర్చేలా చేశాడు. తరువాత మోహమ్మద్ షఫీ అనే మంత్రగాడిని మీరు కలిస్తే మీ సమస్యలు అన్ని తీరిపోతాయని శ్రీదేవి పేరుతో వెళ్లిన సెక్స్ వర్కర్ నాటు వైద్యుడు భగవాల్ సింగ్ కు చెప్పింది.

అక్కడే కథ మొదలైయ్యింది

అక్కడే కథ మొదలైయ్యింది

మొదట మోమమ్మద్ షఫీకి ఫోన్ చేసి మాట్లాడిన భగవాల్ సింగ్ తరువాత అతన్ని నేరుగా కలుసుకుని మ్యాటర్ మొత్తం చెప్పాడు. మీ ఇంటిలో క్షుద్రపూజలు చేసి ఇద్దరు మహిళలను నరబలి ఇస్తే మీ సమస్యల తీరిపోతాయని మోహమ్మద్ షఫీ నాటు వైద్యుడు భగవాల్ సింగ్ కు, అతని భార్య లైలాను నమ్మించాడు.

నరబలి ఎంత భయంకరంగా ఉంటే దేవుడు ?

నరబలి ఎంత భయంకరంగా ఉంటే దేవుడు ?


నరబలి ఎంత భయంకరంగా ఉంటే దేవుడు అంత ఎక్కువగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడని మంత్రగాడు మోహహ్మద్ షఫీ నాటు వైద్యుడు భగవాల్ సింగ్, లైలా దంపతులను రెచ్చగొట్టి వాళ్లతో అతి కిరాతకంగా జంట హత్యలు చేయించాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

మహిళ మాంసంతో వంట చేసి తిన్నారు

మహిళ మాంసంతో వంట చేసి తిన్నారు

మంత్రగాడు మోహమ్మద్ షఫీని నమ్ముకున్న నాటు వైద్యుడు భగవాల్ లాల్ ఇద్దరు మహిళలను అతని ఇంట్లోనే చంపేశారని, మహిళల ముక్కలు వంట చేసుకుని తిన్నారని పోలీసులు చెప్పారని ప్రముఖ మళయాలం దినపత్రిక మాతృభూమి కథనం ప్రచురించింది. అయితే మహిళ శరీరంలోని మాంసం ముక్కలు మేము వంట చేసుకుని తినలేదని భగవాల్ సింగ్, లైలా దంపతులు అంటున్నారని వారి తరపు న్యాయవాది మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+