Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kerala: నరబలి ముందు సినీ ప్రముఖులతో డాక్టర్ దంపతులు భేటీ, లైలా స్టేట్ మెంట్ లో ?, షఫీ తోపు !

తిరువనంతపురం/కొచ్చి: కేరళ నరబలి కేసులో సంచలన విషయాలు వెలుగు చేశాయి. మహిళల నరబలి కేసులో అరెస్టు అయిన నాటు వైద్యుడు భగవాల్ లాల్ భార్య లైలా దగ్గర పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. మహిళల నరబలికి ప్రధాన కారణం అయిన మంత్రగాడు మోహమ్మద్ షఫీ చదివింది 6వ తరగతి అయినా అతను సోషల్ మీడితో తోపు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నరబలికి ముందు నాటు వైద్యుడు భగవాల్ లాల్ ను కొందరు సినీ రంగానికి చెందిన కొందరు కలిశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ కేసు ఎక్కడెక్కడో తిరుగుతుండటంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.

 కేరళ మొత్తం తిరిగేసిన మంత్రగాడు

కేరళ మొత్తం తిరిగేసిన మంత్రగాడు

నరబలి ఇచ్చే ముందు నెల రోజుల పాటు కేరళ మొత్తం తిరిగిన షఫీ అనేక మందిని కలిశాడని పోలీసులకు తెలిసింది. కేరళలోని అనేక జిల్లాల్లో తిరిగిన మంత్రగాడు మోహమ్మద్ షఫీ చాలా చోట్ల రాత్రిపూట బస చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మహిళలను నరబలి ఇవ్వడానికి మోహమ్మద్ షఫీకి కొంత మంది సహకరించి ఉంటారని, వాళ్లు ఎవరు ? అని కేరళ పోలీసులు ఆరా తీస్తున్నారు.

షఫీ చదివింది 6వ తరగతి, చేస్తోంది మాత్రం ?

షఫీ చదివింది 6వ తరగతి, చేస్తోంది మాత్రం ?

మంత్రగాడు మోహమ్మద్ షఫీ చదివింది 6వ తరగతి అయినా అతను సోషల్ మీడితో తోపు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్న షఫీ నిత్యం చేతబడి, నరబలికి సంబంధించిన పుస్తకాలు చదివేవాడని, కొన్ని పుస్తకాలు భగవాల్ లాల్, లైలా దంపతులకు ఇచ్చాడని పోలీసులు అంటున్నారు.

లైలా స్టేట్ మెంట్ లో ఏముంది ?

లైలా స్టేట్ మెంట్ లో ఏముంది ?


భర్త భగవాల్ లాల్ తో కలిసి పధ్మా, రోసలిన్ అనే మహిళలను నరబలి ఇచ్చిన లైలాను విచారణ చేసిన పోలీసులు ఆమె నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. మంత్రగాడు మోహమ్మద్ షఫీ ఒత్తిడితోనే మహిళలను ముక్కలు ముక్కలుగా నరికి ఆ మాంసంతో వంట చేసుకుని తిన్నానని లైలా స్టేట్ మెంట్ ఇచ్చిందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

లాయర్ రివర్స్ గేర్... సాక్షాలు ఉన్నాయంటున్న పోలీసులు

లాయర్ రివర్స్ గేర్... సాక్షాలు ఉన్నాయంటున్న పోలీసులు

అయితే భగవాల్ లాల్, లైలాల న్యాయవాది మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. పోలీసులు బలవంతంగా భగవాల్ లాల్, లైలా దంపతులతో మహిళల మాంసంతో వంట చేసుకుని తిన్నామని చెప్పిస్తున్నారని నిందితుల న్యాయవాది ఆరోపిస్తున్నారు. అయితే మహిళలను ముక్కలు ముక్కలుగా నరికి వంట చేసుకుని భగవాల్ లాల్, లైలా దంపతులు తిన్నారని మాదగ్గర సాక్షాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.

పోలీసు క్లబ్ లో విచారణ

పోలీసు క్లబ్ లో విచారణ

దేశవ్యాప్తంగా కలకలం రేపిన మహిళల నరబలి కేసులో అరెస్టు అయిన భగవాల్ లాల్, లైలా దంపతులు, మంత్రగాడు మోహమ్మద్ షఫీని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని కేరళ పోలీసు క్లబ్ లోని ప్రత్యేక గదిలో విచారణ చేస్తున్నారు. ప్రతిమూడు రోజులకు ఒకసారి ముగ్గురు నిందితులను వైద్యపరీక్షలు చేయించి నివేదిక సమర్పించాలని కోర్టు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

డాక్టర్ ను కలిసిన సినీ ప్రముఖులు ?

డాక్టర్ ను కలిసిన సినీ ప్రముఖులు ?

నరబలి ఇవ్వకముందు కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు నాటు వైద్యుడు డాక్టర్ భగవాల్ సింగ్ ఇంటికి వెళ్లి చికిత్స చేయించుకున్నారని తెలుసుకున్న పోలీసులు ఆ సినీ ప్రముఖులను విచారణ చేసి వివరాలు సేకరించాలని సిద్దం అయ్యారు. నరబలి గురించి భగవాల్ లాల్ సినీ రంగానికి చెందిన వారితో ఏమైనా చర్చించారా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+