బూతులు తిడితే సహించాలా, తుపాకీతో బెదిరించిన ఎమ్మెల్యే
పెద్దమనిషిగా వ్యవహరించాల్సిన ఓ ఎమ్మెల్యే తుపాకీని గురిపెట్టి మరీ బెదిరించాడు.అంతేకాదు తాను చేసిన పనిని సమర్థించుకొన్నాడు.తనకు గన్ లైసెన్స్ కూడ ఉందన్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకొంది.
కొట్టాయం: పెద్దమనిషిగా వ్యవహరించాల్సిన ఓ ఎమ్మెల్యే తుపాకీని గురిపెట్టి మరీ బెదిరించాడు.అంతేకాదు తాను చేసిన పనిని సమర్థించుకొన్నాడు.తనకు గన్ లైసెన్స్ కూడ ఉందన్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకొంది.
కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ఆందోళనకారులపై తుపాకీని ఎక్కుపెట్టిన సంఘటన సంచలనం రేపింది. కొట్టాయం జిల్లా ముండకాయంలోని ఓ ఏస్టేట్ కు చెందిన భూముల్లో కొందరు పేద కూలీలు ఇటీవలే గుడిసెలు వేసుకొన్నారు.

ఈ చర్యను ఏస్టేట్ లో పనిచేస్తోన్న కార్మికులు, కూలీలు వ్యతిరేకించారు. గురువారంనాడు పెద్దఎత్తున గుమికూడిన ఏస్టేట్ కూలీలు గుడిసెలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకొన్న స్థానిక ఎమ్మెల్యే పీసీ జార్జ్ అక్కడికి చేరుకొన్నారు. పేద కూలల పక్షం వహించారు. దీంతో ఏస్టేట్ కార్మికులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఓ దశలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే జార్జ్ తన దగ్గరున్న తుపాకీని తీసి ఆందోళనకారులపై గురిపెట్టారు. చివరకు పోలీసులు జోక్య చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యేను అని చూడకుండా ఏస్టేట్ కార్మికులు తనను పచ్చి బూతులు తిట్టారు. నీ దగ్గర గన్ ఉందా మమ్మల్ని అడ్డుకొంటావా అని రెచ్చగొట్టారు. వాళ్ళను బెదిరించడానికి మాత్రమే గన్ తీసి చూపించానని ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు.
పీసీ జార్జ్ రికార్డ్ స్థాయిలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చెప్పుకోదగిన స్థాయిలో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు.అంతేకాదు ఆయనకు వివాదాస్పదుడిగాను పేరుంది.












Click it and Unblock the Notifications