సిగరెట్ తాగొద్దన్నందుకు.. ప్యాంట్ జిప్ విప్పి..
ఢిల్లీ : సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఓ యువకుడు రచ్చ చేశాడు. విమానంలో సిగరెట్ తాగొద్దన్నందుకు రెచ్చిపోయాడు. ఫ్లైట్‌లో మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. కేసు బుక్ కావడంతో చివరకు కటకటాల పాలయ్యాడు.
కొట్టాయంకు చెందిన అబ్దుల్ షహీద్ శంషుద్దీన్ సౌదీ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ జెడ్డా నుంచి ఢిల్లీకి బయలుదేరాడు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికి అతను విమానంలో సిగరెట్ వెలిగించేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన ఫ్లైట్ అటెండెంట్ అతన్ని వారించింది. ఫ్లైట్‌లో సిగరెట్ తాగకూడదని చెప్పింది. దీంతో రెచ్చిపోయిన శంషుద్ధీన్ రచ్చ చేశాడు. తొలుత ఆమెతో వాగ్వాదానికి దిగి ఆ తర్వాత బండ బూతులు తిట్టాడు.

శంషుద్ధీన్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా సదరు మహిళ పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఇతర సిబ్బందిని సాయం కోసం పిలిచింది. దీంతో మరింత రెచ్చిపోయిన యువకుడు ప్యాంట్ జిప్ తెరిచి అసభ్యంగా సంజ్ఞలు చేశాడు. విమానం ఢిల్లీలో ల్యాండైన వెంటనే క్యాబిన్ క్రూ సిబ్బంది ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందజేశారు. దీంతో శంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు నిందితున్ని కటకటాలవెనక్కి నెట్టారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications