Wow U R Great:లారీపై మంటలు.. అయినా గ్రౌండ్‌లో తిప్పి, కంట్రోల్... శభాష్ చోదకా..!
ఆపద వచ్చిందనుకొ.. ధైర్యంగా ఎదుర్కొవాలి. ఇక డ్రైవింగ్ చేసే సమయంలో అయితే మరీను.. అవును ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. ఒకతను చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి లారీ దగ్గం కాకుండా కాపాడారు. కేరళలోని కొండెంచరి గుండా ఓ లారీ వెళ్తుంది. అందులో వరి గడ్డి తీసుకొని వస్తుంది. విద్యుత్ వైర్లు తగలి మంటలు లేచాయి. ఇంకేముంది మంటలు వేగంగా వ్యాపించగా.. డ్రైవర్ అందులో నుంచి దూకేశాడు. కానీ మరొకరు లారీని కంట్రోల్ చేశారు. అవును లారీని రోడ్డు నుంచి పక్కకు తీసుకెళ్లి.. మందుకు వెనకకు నడపారు. వరి గడ్డి కింద పడిపోయింది. ఫైరింజన్ వచ్చే వరకు ఆయన అలా చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.

12.30 గంటలకు ఘటన
ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగింది ఘటన.. కొందరు వీడియో తీసి ఇన్ స్టలో పోస్ట్ చేశారు. లారీనీ షాజీ వర్గిసి అలియాస్ షాజీ పప్పన్ కాపాడారు. అంతేకాదు లారీ పట్టణం, లేదంటే ఇళ్లలోకి వెళ్లకుండా కాపాడారు. లేదంటే మరొలా ఉండేది. అయితే మంటలు వచ్చిన సమయంలో జనం ఎక్కువగానే ఉండేవారు.. అదీ కాస్త ఇబ్బంది కలిగించింది.

ఇతరుల సాయం
వర్గిసికి ఇతరులు కూడా సాయం చేశారు. ఫైరింజన్ వచ్చేవరకు అలా మేనేజ్ చేశారు. వర్గిసి గత 25 ఏళ్లుగా హెవీ మోటర్ వెహికిల్స్ నడుపుతున్నారు. తన అనుభవం అంతా రంగరించి మరీ డ్రైవ్ చేశారు. ఇదివరకు తాను చేసిన సాహసాలు ఇప్పుడు పనిని వచ్చాయని అతను అంటున్నారు.
Recommended Video
అభినందనలు
ఘటన తర్వాత తనకు అభినందనలు వస్తున్నాయని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా అందరూ గుర్తు పట్టి మరీ విష్ చేస్తున్నారని తెలిపారు.ప్రమాదం జరిగిన స్థలానికి ఫైర్ స్టేషన్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అతను పరిస్థితిని చేయి దాటనీవలేదని.. లారీనీ కూడా దగ్దం కానీయకుండా జాగ్రత్త పడ్డారని అగ్నిమాపక సిబ్బంది అంటున్నారు.












Click it and Unblock the Notifications