ఎమ్మెల్యేకి బిగ్ షాక్.. సమస్యలు పట్టించుకోవట్లేదని చొక్కా పట్టుకొని మరీ !!
కేరళలో ఒక అంగన్‌వాడీ ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేకు ఊహించని షాక్ ఎదురైంది. కన్నూర్ జిల్లా కుతుపరంబు నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ మోహనన్.. స్థానిక సమస్యలను పట్టించుకోలేదన్న ఆరోపణలతో ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఆయన చొక్కా పట్టుకుని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రజల ఆగ్రహాం..
ప్రజలు ముఖ్యంగా డయాలసిస్ కేంద్రం నుంచి వెలువడుతున్న శుద్ధి చేయని వ్యర్థాలపై తీవ్రంగా స్పందించారు. ఈ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండటంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, పర్యావరణం మరియు ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎమ్మెల్యే ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

ఎమ్మెల్యేపై దురుసు ప్రవర్తన..
కాగా ఈ విషయంపై స్థానికులు ప్రశ్నించగా.. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ కొందరు ఆయన చొక్కా పట్టుకుని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ప్రజలను శాంతింపజేశారు. “ఏళ్ల తరబడి ఈ సమస్యతో మేము ఇబ్బంది పడుతున్నామని.. ఫిర్యాదులు చేసినా ఎటువంటి ఫలితం రాలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అందుకే ఎమ్మెల్యేను నిలదీయాల్సి వచ్చిందని వెల్లడించారు.
ఇక ఈ ఘటన కేరళ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజల అసహనం సహజమని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుండగా.. ప్రజాప్రతినిధులు సమస్యలను విస్మరిస్తే ఇలాంటివి తప్పవని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
"Protesters Confront Koothuparamba MLA KP Mohanan Over Drinking Water Contamination at Kariyad; Police Register Case Against 25 for Unlawful Assembly"#Koothuparamba #kpmohanan #peopleprotest pic.twitter.com/lcAMzBCdzO
— @Vinod Fattepur (@ChalavadiVinod) October 3, 2025












Click it and Unblock the Notifications