వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nipah Virus : కేరళను వణికిస్తున్న నిఫా వైరస్-251 కాంటాక్ట్స్ గుర్తింపు-11 మందిలో లక్షణాలు

|
Google Oneindia TeluguNews

ఇప్పటికే కరోనా కేసులతో సతమతమవుతున్న కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. నిఫా వైరస్ బారిన పడిన 12 ఏళ్ల ఓ బాలుడు ఆదివారం(సెప్టెంబర్ 5) మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా అతని కాంటాక్ట్స్‌లో 11 మందిలో నిఫా వైరస్ లక్షణాలు గుర్తించారు. ఇప్పటివరకూ మొత్తం 251 కాంటాక్ట్స్‌ను గుర్తించారు. ఇందులో 125 మంది హెల్త్ కేర్ వర్కర్స్ ఉండగా... వీరిలో 54 మంది హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు. ఇప్పటివరకూ వీరిలో 38 మందిని ఐసోలేషన్‌కి తరలించారు. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణ జార్జి ఈ వివరాలు వెల్లడించారు.

Deepika Padukone:పసుపు రంగు చీరలో బోల్డ్ బ్యూటీ (ఫొటోస్)Deepika Padukone:పసుపు రంగు చీరలో బోల్డ్ బ్యూటీ (ఫొటోస్)

వైరాలజీ ల్యాబ్‌కు 8 మంది శాంపిల్స్...

వైరాలజీ ల్యాబ్‌కు 8 మంది శాంపిల్స్...

'ఆ బాలుడి కాంటాక్ట్స్‌లో 38 మందిని ప్రస్తుతం కోజికోడ్‌ మెడికల్ కాలేజీలోని ఐసోలేషన్ వార్డులో ఉంచాం. వీరిలో 11 మందిలో వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. 8 మంది శాంపిల్స్‌ను పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించాం.సోమవారం(సెప్టెంబర్ 6) రాత్రికి ఆ రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. మరో ముగ్గురి శాంపిల్స్‌ను కోజికోడ్‌ మెడికల్ కాలేజీ ల్యాబ్‌లోనే పరీక్షించే అవకాశం ఉంది. మృతి చెందిన ఆ బాలుడి తల్లికి జ్వరం కాస్త తగ్గింది.' ఆ వీణ జార్జి తెలిపారు. కోజికోడ్ మెడికల్ కాలేజీలో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నామని... సోమవారం రాత్రి నుంచే శాంపిల్స్‌ను పరీక్షించే అవకాశం ఉందని అన్నారు.

Nipah Virus : కేరళలో నిఫా కలకలం-12 ఏళ్ల బాలుడు మృతి-ఓవైపు కరోనా వణికిస్తుండగానే...Nipah Virus : కేరళలో నిఫా కలకలం-12 ఏళ్ల బాలుడు మృతి-ఓవైపు కరోనా వణికిస్తుండగానే...

ఆ ఇంటి పరిసరాల్లో గబ్బిలాలు

ఆ ఇంటి పరిసరాల్లో గబ్బిలాలు

కేరళ పశుసంవర్ధక శాఖకు చెందిన బృందం ఆ బాలుడి ఇంటికి వెళ్లి అక్కడి పరిసరాలను పరిశీలించినట్లు వీణ జార్జి తెలిపారు.'ఆ ప్రదేశంలో కొన్ని రంబూటన్ చెట్లు ఉన్నాయి. గబ్బిలాలు తరచూ ఆ చెట్లపై వాలుతుంటాయి. ఇక్కడికి సమీపంలోని సరస్సు చుట్టూ ఎప్పుడూ గబ్బిలాలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించారు. ఆ బాలుడి ఇంట్లో రెండు మేకలు ఉన్నట్లు గుర్తించారు. వాటి నుంచి కూడా శాంపిల్స్ సేకరించారు.' అని వీణ జార్జి వెల్లడించారు.

ఇంటింటికి వెళ్లనున్న మెడికల్ టీమ్

ఇంటింటికి వెళ్లనున్న మెడికల్ టీమ్

బుధవారం(సెప్టెంబర్ 8) భోపాల్ నుంచి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందం కేరళ వస్తున్నట్లు వీణ జార్జి తెలిపారు. మృతి చెందిన ఆ బాలుడి ఇంటిని,అక్కడి పరిసరాలను వారు పరిశీలిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా శాంపిల్స్ సేకరిస్తారని తెలిపారు. మంగళవారం(సెప్టెంబర్ 7) నుంచి ఆ ప్రాంతంలో మెడికల్ టీమ్ ఇంటింటికి వెళ్తుందన్నారు. ఆ బాలుడి కాంటాక్ట్స్‌లో ఎవరికైనా నిఫా లక్షణాలు బయటపడ్డాయా అన్నది ఆ టీమ్ పరిశీలిస్తుందన్నారు. ప్రస్తుతం కన్నూర్,మలప్పురం,వయనాడ్ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించామన్నారు.

Recommended Video

AP Corona Virus Update.. ఆ రెండు జిల్లాల్లోనే అధికం!!
స్పందించిన కేంద్రమంత్రి మురళీధరన్...

స్పందించిన కేంద్రమంత్రి మురళీధరన్...

కేరళకు చెందిన కేంద్రమంత్రి మురళీధరన్ రాష్ట్రంలో నిఫా కలకలంపై స్పందించారు. ఈ అంశంపై కేంద్ర వైద్యారోగ్య శాఖలోని సంబంధిత అధికారులతో తాను మాట్లాడినట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తాము గమనిస్తున్నామని... ఇప్పటికైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు వెల్లడించినట్లు తెలిపారు. నిఫా కేసుల పట్ల కేరళ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నిఫా కేసుల మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ప్రత్యేక ప్రోటోకాల్‌ను విడుదల చేశారు. కేరళలో మే 19,2018 తొలి నిఫా కేసు బయటపడింది. అప్పట్లో ఈ వైరస్ బారినపడినవారిలో 17 మంది చనిపోయారు. నిఫా వైరస్ అనేది జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ముఖ్యంగా గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఇది పందులు,కుక్కలు,గుర్రాలు ఇతర జంతువులకు సోకుతుంది. మనుషులకు సోకితే... వైరస్ లోడ్ ఎక్కువైతే మరణం సంభవిస్తుంది.

English summary
Nipah virus symptoms were found in 8 of the death boy's contacts. A total of 251 contacts have been identified so far. Of these, 125 are health care workers, 54 of whom are in the high risk category. So far 38 of them have been moved to isolation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X