మాజీ బిషప్‌ ఫ్రాంకోకు ఊరట: రేప్ కేసులో నిర్దోషిగా కొట్టాయం కోర్టు తీర్పు

సన్యాసినిని రేప్ చేసిన కేసులో మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు ఊరట కలిగింది. అతను నిర్దోషి అని కొట్టాయం జిల్లా సెషన్స్ కోర్టు తేల్చింది. 2014 నుంచి 2016 మధ్య కాలంలో నన్ పై అత్యాచారం చేసినట్లు ఫ్రాంకో ములక్కల్ పై ఆరోపణలు వచ్చాయి. సంచలనం రేపిన ఈ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. 100 రోజుల పాటు జరిగిన విచారణ అనంతరం ములక్కల్ నిర్దోషి అని కోర్టు తేల్చి చెప్పింది.

అత్యాచారం కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయ పడింది. ఈ కేసులో జస్టిస్ జీ గోపకుమార్ సింగిల్ లైన్ తీర్పునిచ్చారు. ఫ్రాంకోపై మోపిన అభియోగాల నుంచి రిలీఫ్ కల్పిస్తున్నట్లు పేర్కోన్నారు. జలంధర్ డయోసిస్‌లో ములక్కల్ బిషప్‌గా పని చేశారు. కురవిలంగాడ్‌లోని మిషనరీస్ ఆఫ్ జీసస్ కాన్వెంట్ లోని సన్యాసిని 2014-16 మధ్య కాలంలో కాన్వెంట్‌కు వెళ్లింది. అయితే తనపై 13 సార్లు బిషప్ ములక్కల్ అత్యాచారం చేశారని బాధితురాలు 2018లో కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Kerala nun rape case accused Bishop Franco Mulakkal acquitted

కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2018 అక్టోబర్‌లో బిషప్‌ను అరెస్ట్ చేసి అక్రమ నిర్భంధం, రేప్, అసహజ శృంగారం, నేర ప్రవృత్తి కింద కేసులు నమోదు చేసింది. కోర్టులో 2000 పేజీల చార్జీషీట్‌ను దాఖలు చేశారు. 2018 అక్టోబర్ 15వ తేదీ‌న బిషప్ ములక్కల్ బెయిల్ పై విడుదల అయ్యారు. 2019 నవంబర్ నుంచి కేసులో విచారణ మొదలయ్యింది. 39 మంది ఈ కేసులో సాక్ష్యం చెప్పగా, ఒక్కరు కూడా సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయారు. జనవరి 10వ తేదీన విచారణ ముగిసింది. ఈ కేసులో కోర్టు అనుమతితో మీడియాకు సమాచారాన్ని అందజేశారు.

మరోవైపు సెషన్స్ కోర్టు తీర్పుపై కొట్టాయం జిల్లా ఎస్పీ హరి శంకర్ స్పందించారు. తీర్పు తనను షాక్ కు గురిచేసిందని చెప్పారు. బిషప్ కు వ్యతిరేకంగా ఆధారాలు అన్నీ చాలా బలంగా ఉన్నాయని తెలిపారు. సాక్షులు కూడా వ్యతిరేకంగా మారలేదని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+