కేరళ నన్ అత్యాచారం కేసు: మాజీ బిషప్ ఫ్రాంకో ముల్లకల్‌కు రెండు రోజుల పోలీసు కస్టడీ

కేరళ: కేరళ నన్ పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ మాజీ బిషప్ ఫ్రాంకో ముల్లకల్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. రెండురోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ముల్లకల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను జడ్జి తిరస్కరించారు. కేసును పాలాకోర్టులో విచారణ చేయడం జరిగింది. మూడురోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసుల తరుపున న్యాయవాది జడ్జిని కోరారు. అయితే ములక్కల్ తరపున న్యాయవాది మాత్రం ఇప్పటికే తన క్లయింట్‌ను ఎనిమిది గంటలపాటు పోలీసులు విచారణ చేశారని జడ్జి దృష్టికి తీసుకురావడంతో ములక్కల్‌ను రెండు రోజుల పాటు పోలీస్ కస్డటీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే ములక్కల్‌ను లోతుగా విచారణ చేయాల్సి ఉందని, సరైన సాక్ష్యాలు రుజువులు సేకరించాల్సి ఉందని అంతేకాక కొన్ని పరీక్షలు అంటే పొటెన్సీ టెస్టు కూడా ములక్కల్ ‌పై చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వీటన్నిటికీ రెండురోజుల సమయం సరిపోదని న్యాయస్థానానికి తెలిపారు.

Kerala nun rape case:Two days custody given to former Bishop Franco Mullakal

ములక్కల్ తనపై 2014 నుంచి 2016 మధ్య 13 సార్లు అత్యాచారం చేశారంటూ ములక్కల్‌పై కేరళ నన్ ఆరోపించారు. దీంతో ఆయన్ను మూడురోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు చివరకు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.అంతకుముందు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పడంతో హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. శనివారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జి కాగానే మాజీ బిషప్ ములక్కల్‌ను పోలీసులు జైలుకు తరలించారు. ఆయనపై పలు ఐపీసీ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 81 మంది ఈ కేసులో సాక్షులుగా ఉన్నారని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇదిలా ఉంటే ములక్కల్ కేరళ హైకోర్టులో బెయిల్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. అది సెప్టెంబర్ 25న విచారణకు రానుంది.

ఇదిలా ఉంటే కొచ్చిలో ములక్కల్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఐదుగురు నన్‌లు ఆయన అరెస్టుతో ధర్నాను విరమించారు. కష్టకాలంలో తమకు చర్చి అండగా నిలవకపోయినప్పటికీ భగవంతుడు తమకు అండగా నిలిచారని చెప్పారు. తమ నిరసనలు ఏ ఒక్క వ్యక్తిపైనో కాదని చెప్పిన నన్‌లు దేవుని పేరుతో జరుగుతున్న అవినీతిపైనే అని వెల్లడించారు. తమతో కష్టకాలంలో అండగా నిలిచిన కేరళ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. చర్చి అధికారులు తమపై ఏమైనా చర్యలు తీసుకుంటే తిరిగి ధర్నా చేస్తామని హెచ్చరించారు. నన్‌లపై అత్యాచారాలకు పాల్పడి ఆతర్వాత డబ్బు కండబలంతో తప్పించుకోవాలనుకునే వారికి ములక్కల్ కథ ఒక గుణపాఠం అవుతుందని సిస్టర్ అనుపమ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+