భార్యల మార్పిడి.. యాప్‌లో చేరి, ఛేంజ్ చేసుకొని.. ఎక్కడ, ఎలా అంటే
మనకు డ్రగ్స్ రాకెట్, సెక్స్ రాకెట్ తెలుసు.. కానీ భార్యల మార్పిడి రాకెట్ అనేది తెలియదు. తెలిసినా.. సినిమాల్లో.. హై ప్రొఫైల్ వేదికల మీద జరుగుతుంటాయి. అయితే హైలీ ఎడ్యుకేటెడ్ స్టేట్ కేరళలో భార్యల మార్పిడి రాకెట్ జరుగుతుంది. గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతోంది. లైంగిక సంబంధాలకు భార్యల మార్పిడి రాకెట్ నిదర్శనంగా కనిపిస్తోంది. మితిమీరిన లైంగిక సంబంధాల కోసం భర్త తన భార్యను మార్పిడి చేయటానికి యత్నిస్తున్న క్రమంలో సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ రాకెట్ బయటపడింది. అయితే ఆ ప్రక్రియలో వెయ్యి జంటల ప్రమేయం ఉండటం షాక్‌నకు గురిచేస్తోంది.

ఇతరులతో సంబంధం
ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని బలవంతపెట్టడంతో.. బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది. లేదంటే ఈ రాకెట్ బయటపడేది కాదు. భార్యల మార్పిడి రాకెట్‌లో వేరే వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని బలవంతపెడుతున్న భర్త ఆగడాలు భరించలేని ఓ వివాహిత కారుకాచల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగి.. భార్యల మార్పిడి రాకెట్ భాగోతాన్ని బయటపెట్టారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గతంలో కాయంకుళం ప్రాంతంలో కూడా ఇలానే జరిగాయట. భార్యల మార్పిడి రాకెట్ కేరళలో నిర్వహించడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను యూజ్ చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

ఇలా కనెక్ట్ అవుతారు..
రాకెట్ ముఠాగా ఏర్పడి టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపులలో చేరారని..అలా ఒకరికొకరు కనెక్ట్ అవుతారని తెలిపారు. భర్త అరాచకాలు భరించలేకి బయటకొచ్చి ఫిర్యాదు చేసిన మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నామని..ఈ రాకెట్ వెనుక చాలామంది పాత్ర ఉందని తెలిపారు. ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశామని, మరికొంత మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు. నిందితులు అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
Recommended Video

ఎక్కువగా వీరే
కేరళలో ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ రాకెట్‌లో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. భార్యల మార్పిడి బాగోతంపై 25 మంది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని.. అతి త్వరలోనే మరింత మందిని పట్టుకుంటామని కేరళ పోలీసులు వివరించారు. కేరళ లాంటి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో ఇలా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. చదువు సంస్కారం నేర్పుతుందని అంటారు.. కానీ ఇలా భార్యలను మార్చుకొని కొందరు దిగజారుతున్నారు. వారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications