వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: కేరళ పోలీసుల డ్యాన్స్, వైరల్‌గా మారిన వీడియో..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మరి జనాలను గజ గజ వణికిస్తోంది. పేరు చెబితేనే చాలు ప్రజల గుండెలు గుబేలు మంటున్నాయి. శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసులు.. వైరస్‌పై కూడా పోరాడుతున్నారు. కరోనాకు మందు లేదని నివారణ ఒక్కటే మార్గమని చెబుతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని కేరళ పోలీసులు డ్యాన్స్ చేసి మరీ అవగాహన కల్పించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recommended Video

Viral Video : Kerala Police Doing Handwashing Dance Goes Viral

దైవభూమి కేరళలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆ ముగ్గురు వైరస్ బారినుంచి కోలుకున్నారు. తర్వాత కూడా వైరస్ క్రమంగా ప్రబలింది. పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ప్రజల్లో ధైర్యం నింపేందుకు త్రివేండ్రం పోలీసులు ముందుకొచ్చారు. కరోనా వైరస్‌కు మందు లేదని.. నివారణ ఒక్కటే మార్గమని సందేశం ఇచ్చారు. మొహానికి మాస్క్ కట్టుకొని.. డ్యాన్స్ చేశారు.

kerala police dance for coronavirus Awareness

పోలీసులు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కొడుతోంది. డ్యాన్స్ చేస్తూనే.. చేతులు కడుక్కొవాలని పోలీసులు చెప్పిన సందేశం బాగుందని నెటిజన్లు అంటున్నారు. దీని ఉద్దేశం వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని అర్థమవుతోంది. పదే పదే చేతులు కడుక్కొవాలని.. శానిటైజర్ వాడాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీసుల సూచనను ప్రజలు పాటించి.. కరోనా వైరస్‌ను ఎదుర్కొవాలని నెటిజన్లు కోరుతున్నారు.

English summary
kerala police dance for coronavirus Awareness in trivandrum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X