హీరో దిలీప్ భార్య కావ్య, ఆమె తల్లి ఎస్కేప్, నటి లైంగిక దాడి వీడియో, మెమెరీ కార్డు ఎక్కడ !
నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం హీరో దిలీప్ కు సంబంధించి పూర్తి వివరాలు సేకరించడంలో కేరళ పోలీసులు బిజీ అయ్యారు.
కొచ్చి: నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం హీరో దిలీప్ కు సంబంధించి పూర్తి వివరాలు సేకరించడంలో కేరళ పోలీసులు బిజీ అయ్యారు. హీరో దిలీప్ ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ బుధవారం న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసు విచారణలో హీరో దిలీప్ అనేక కీలక విషయాలు చెప్పాడని కేరళ పోలీసులు అంటున్నారు. ఈ సందర్బంలోనే హీరో దిలీప్ రెండో భార్య, మలయాళం నటి కావ్య మాధవన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కావ్య మాధవన్ ఆచూకి లేకపోవడంతో పోలీసులు ఇప్పుడు ఆమె కోసం గాలిస్తున్నారు.

నటి కేసులో ఏమిటి విషయం ?
నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో మలయాళం హీరో దిలీప్ పాత్ర ఉందని కేరళ పోలీసులు గట్టిగా చెబుతున్నారు. ఈ కేసులో దిలీప్ రెండో భార్య, నటి కావ్య మాధవన్ కు ఎలాంటి సంబంధం ఉంది ? అంటూ కేరళ పోలీసులు ఆరా తీస్తున్నారు.

నటి కేసులో ఏమిటి విషయం ?
నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో మలయాళం హీరో దిలీప్ పాత్ర ఉందని కేరళ పోలీసులు గట్టిగా చెబుతున్నారు. ఈ కేసులో దిలీప్ రెండో భార్య, నటి కావ్య మాధవన్ కు ఎలాంటి సంబంధం ఉంది ? అంటూ కేరళ పోలీసులు ఆరా తీస్తున్నారు.

కావ్య చేతికి మెమోరీ కార్డు ?
నటిపై లైంగిక దాడి చేసే సమయంలో మొబైల్ లో వీడియో తీశామని, తరువాత మొబైల్ లోని మెమెరీ కార్డు తీసి కావ్య మాధవన్ కు చెందిన ‘లక్ష'ఈ కామార్స్ షోం రూంలో ఇచ్చానని పల్సర్ సునీ ఇప్పటికే పోలీసుల విచారణలో అంగీకరించాడు.

రెండు సార్లు సోదాలు చేసినా !
కావ్య మాధవన్ కు చెందిన లక్ష ఈ కామర్స్ షో రూంలో రెండు సార్లు సోదాలు చేసినా పోలీసులకు మాత్రం నటిపై లైంగిక దాడి చేసే సమయంలో వీడియో తీసిన మెమెరీ కార్డు మాత్రం చిక్కలేదు. అక్కడ ఉన్న సిబ్బందిని విచారణ చేసినా ఫలితం శూన్యం అని పోలీసులు అంటున్నారు.

సీసీ కెమెరాల్లో
నటి లైంగిక దాడి వీడియో క్లిప్పింగ్స్ ఉన్న మెమెరీ కార్డు ఎలా మాయం అయ్యింది ? అంటూ వివరాలు సేకరించడానికి లక్ష షో రూంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించాలని గురువారం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కావ్య మాధవన్ మెమెరీ కార్డు మాయం చేశారా ? అని ఆరా తీస్తున్నారు.

మదమ్ పాత్ర ?
లైంగిక దాడికి గురైన నటి ఈ కేసులో మదమ్ కు సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పల్సర్ సునీతో కలిసి మదమ్ తనను కిడ్నాప్ చేసి ఉంటాడని ఆమె పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మదమ్ కూడా నిందితుడే అని పోలీసులు అంటున్నారు.
Recommended Video


పల్సర్ సునీ లక్ష షోరూంలో !
నటి లైంగిక దాడి వీడియో తీసిన మెమెరీ కార్డు తీసుకెళ్లి కావ్య మాధవన్ లేదా ఆమె తల్లి శ్యామలకు ఇవ్వాలని ఈ కేసులోని నిందితుడు మదమ్ ఏమైనా పల్సర్ సునీకి సూచించాడా ? అనే అనుమానాలు ఉన్నాయని కేరళ పోలీసులు అంటున్నారు.

తల్లి, కూతురు కావ్య మాయం
మలయాళం హీరో దిలీప్ అరెస్టు అయిన తరువాత అతని రెండో భార్య కావ్య మాధవన్, ఆమె తల్లి శ్యామల ఇద్దరూ మాయం అయ్యారని కేరళ పోలీసులు అంటున్నారు. నటి లైంగిక దాడి వీడియో క్లిప్పింగ్స్ ఉన్న మెమెరీ కార్డు కావ్య మాధవన్, లేదా ఆమె తల్లి శ్యామల దగ్గరే ఉండాలని కేరళ పోలీసులు అంటున్నారు.

బెయిల్ రాక ముందే కావ్య కథ
హీరో దిలీప్ బెయిల్ తీసుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే దిలీప్ కు బెయిల్ రాక ముందే కావ్య మాధవన్, ఆమె తల్లి శ్యామలను విచారణ చేసి వివరాలు సేకరించాలని కేరళ పోలీసులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కావ్య మాధవన్, ఆమె తల్లి శ్యామల ఆచూకి మాత్రం పోలీసులకు చిక్కలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications