మళయాలం నటిపై లైంగిక దాడి, వీడియో: నటి కావ్య దగ్గర మెమరీ కార్డు ? సోదాలు !

ప్రముఖ మళయాలం నటిపై సామూహిక లైంగిక దాడి జరిగిన సమయంలో ప్రముఖ నిందితుడు పల్సర్ సునీ వీడియో తీశాడని వెలుగు చూడటంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

తిరువనంతపురం: ప్రముఖ మళయాలం నటిపై సామూహిక లైంగిక దాడి జరిగిన సమయంలో ప్రముఖ నిందితుడు పల్సర్ సునీ వీడియో తీశాడని వెలుగు చూడటంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో సోమవారం పోలీసులు కీలక సమాచారం సేకరించారని తెలిసింది.

నటిపై సామూహిక లైంగిక దాడి జరిగిన కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ప్రముఖ మళయాలం హీరో దిలీప్ భార్య నటి కావ్య మాధవన్ ఇంటిలో, ఆమెకు చెందిన ఇ - కామర్స్ షోరూంలో పోలీసులు సోదాలు చేశారు. పోలీసులు దిలీప్ భార్య కావ్య మాధవన్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

మొబైల్ లో వీడియో

మొబైల్ లో వీడియో

ప్రముఖ మళయాలం నటి మీద కారులో లైంగిక దాడి జరిగిన సమయంలో పల్సర్ సునీ తన మొబైల్ లో వీడియో తీశాడు. అయితే మొబైల్ ఎక్కడో పోయిందని పోలీసుల దగ్గర నాటకాలు ఆడాడు. మొబైల్ చిక్కలేదని పోలీసులను తప్పుదోవపట్టించాడు.

బెండ్ తీస్తే అసలు విషయం

బెండ్ తీస్తే అసలు విషయం

మొబైల్ పోయిందని నాటకాలు ఆడుతున్న పల్సర్ సునీని పోలీసులు బెండ్ తీశారు. నటిపై కారులో లైంగిక దాడి జరిగే సమయంలో మొబైల్ లో చిత్రీకరించిన వీడియో ఉన్న మెమరీ కార్డు ప్రముఖ మళయాలం హీరో దిలీప్ భార్య కావ్య మాధవన్ కు పంపించానని పల్సర్ సునీ అంగీకరించాడని సమాచారం.

షోరూంలో సోదాలు

షోరూంలో సోదాలు

నటి కావ్య మాధవన్ కు చెందిన ఇ- కామర్స్ షోరూం లక్ష (బట్టల షోరూం)లో పోలీసులు మూడు గంటల పాటు సోదాలు చేశారు. పల్సర్ సునీ ఇచ్చిన సమాచారం మేరకు నటిపై లైంగిక దాడి జరిగే సమయంలో చిత్రీకరించిన వీడియో ఉన్న మెమరీ కార్డు కోసం పోలీసులు సోదాలు చేశారని తెలిసింది.

నటి కావ్య ఇంటిలో

నటి కావ్య ఇంటిలో

నటి కావ్య మాధవన్ ఇంటిలో పోలీసులు రెండు సార్లు సోదాలు చేశారు. అయితే వీడియో ఉన్న మెమరీ కార్డు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అధికారికంగా దృవీకరించడం లేదు. నటి కావ్య ఇంటిలో, లక్ష షోరూంలో సోదాలు చేశామని పోలీసులు చెప్పారు.

హీరో దిలీప్ కు లెటర్

హీరో దిలీప్ కు లెటర్

వీడియో ఉన్న మెమరీ కార్డు కక్కనాడ్ లోని ఇ-కామార్స్ లక్ష షోరూంకు పంపించానని పల్సర్ సునీ హీరో దిలీప్ కు లెటర్ రాశాడని పోలీసులు అంటున్నారు. కక్కనాడ్ లోని లక్ష షోరూంకు తాను రెండు సార్లు వెళ్లానని పల్సర్ సునీ పోలీసులకు చెప్పాడు. ఆ షోరూం నటి కావ్య మాధవన్ కు చెందినది కావడం కొసమెరుపు.

హీరో దిలీప్ విచారణ

హీరో దిలీప్ విచారణ

నటిపై సామూహిక లైంగిక దాడి జరిగిన కేసులో పల్సర్ సునీ ఇచ్చిన సమాచారం మేరకు మళయాలం నటుడు దిలీప్ ను ఇప్పటికే పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. అయితే ఇప్పుడు ఆయన భార్య కావ్య మాధవన్ ఇంటిలో, షోరూంలో సోదాలు చెయ్యడంతో కేసు విచారణ కొత్తపలుపు తిరిగింది.

పల్సర్ సునీ

పల్సర్ సునీ

పల్సర్ సునీ తన స్నేహితులతో మాట్లాడే సమయంలో హీరో దిలీప్ పేరు అనేక సార్లు ప్రస్తావించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే సమయంలో దిలీప్ భార్య కావ్య మాధవన్ ఇంటిలో, ఆమె నిర్వహిస్తున్న షోరూంలో పోలీసులు సోదాలు చెయ్యడంతో కేసు విచారణ వేగవంతం అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+