నటి లైంగిక దాడి కేసు: ఇద్దరు కేరళ ఎమ్మెల్యేల విచారణ, హీరో దిలీప్ తో, ఏం చెప్పారు !
ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ హీరో దిలీప్ కు అత్యంత సన్నిహితులైన కేరళకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు.
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ హీరో దిలీప్ కు అత్యంత సన్నిహితులైన కేరళకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. కొచ్చిలోని కేరళ పోలీసు క్లబ్ లో ఇద్దరు ఎమ్మెల్యేలను పోలీసులు విచారణ చేశారు.
దిలీప్ కు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలను విచారణకు రావాలని కేరళ పోలీసులు సూచించారు. ఇద్దరు ఎమ్మెల్యేలను వేరేవేరుగా పోలీసులు విచారణ చేశారు. ఎమ్మెల్యేలను దాదాపు నాలుగు గంటల పాటు విచారణ చేశారని మలయాళం మీడియా వార్తలు ప్రసారం చేసింది.

మీకు వారితో ఏంటి లింక్ ఝ
నటి లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన పల్సర్ సునీ తప్పించుకోవడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు సహాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. నటి లైంగిక దాడి కేసులో మీకు ఎలాంటి సంబంధం ఉంది ? హీరో దిలీప్ తో పాటు ప్రధాన నిందితుడు పల్సర్ సునీతో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అంటూ పోలీసులు ప్రశ్నించారని సమాచారం.
Recommended Video


పోలీసులకే చుక్కలు చూపించాడు
నటిపై లైంగిక దాడి జరిగిన తరువాత పల్సర్ సునీ చాల రోజులు తప్పించుకుని తిరిగాడు. చివరికి పల్సర్ సునీ తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి రహస్యంగా తప్పించుకుని తిరుగుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఆ సందర్బంలో రాజకీయ నాయకులు పల్సర్ సునీ తప్పించుకోవడానికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే
ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణను కేరళ పోలీసులు రికార్డు చేసుకున్నారని మలయాళం మీడియా సోమవారం వార్తలు ప్రసారం చేసింది. పోలీసులు విచారణ చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే థామస్ కూడా ఉండటం కొసమెరుపు.

హీరోను మళ్లీ కస్టడీకి ఇవ్వాలని ?
కేరళ పోలీసులు దిలీప్ ను మళ్లీ కస్టడిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. దిలీప్ ను విచారణ చెయ్యడానికి కస్టడీకి ఇవ్వాలని కేరళ పోలీసులు అంగమాలి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానాన్ని ఆశ్రంచాలని నిర్ణయించారు.

హీరోకు మద్దతుగా నానా హంగామా !
శనివారం రాత్రి ఆలువా సబ్ జైలుకు దిలీప్ ను తరలించారు. ఆ సందర్బంలో హీరో దిలీప్ కు మద్దతుగా జైలు బయట కొందరు నానా హంగామా చేశారు. ఆ సందర్బంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే పారిపోయారు. నానా హంగామా చేసిన వారిని గుర్తించామని, త్వరలో అదుపులోకి తీసుకుంటామని కేరళ పోలీసులు తెలిపారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications