వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో మరింత తగ్గిన కరోనా కేసులు: 10 వేల లోపు కేసులు.. 149 మంది మృత్యువాత

|
Google Oneindia TeluguNews

దైవ భూమి కేరళలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 12 వేల పైచిలుకు కేసులు రాగా.. ఇవాళ అదీ మరింత తగ్గింది. గత 24 గంటల్లో 8850 కరోనా కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 47,29,083కి చేరింది. వైరస్ సోకిన 149 మంది చనిపోయారు. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 25 వేల 526గా ఉంది. ఆది, సోమవారాల్లో 17 వేల ఏడు మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 45,74, 206కి చేరింది. రాష్ట్రంలో 1,28, 736 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 74 వేల 871 మందికి పరీక్షలు చేశారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

 Kerala records 8,850 new Covid-19 cases

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

English summary
Kerala detected 8,850 new Covid-19 cases in the last 24 hours, taking the caseload to 47,29,083, said the state health ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X