యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్: కేరళలో 5కు పెరిగిన కేసులు, దేశంలో 7కు

తిరువనంతపురం: కేరళలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో కొత్త మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో పరీక్షించారు. దీంతో అతనికి మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. కాగా, కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఐదుకు చేరింది.

రాష్ట్రంలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదైందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ధృవీకరించారు. 30 ఏళ్ల బాధితుడు ప్రస్తుతం మలప్పురంలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు.

జులై 27న యూఏఈ నుంచి కోజికోడ్ విమానాశ్రయానికి చేరుకున్న బాధితుడు.. మలప్పురంలోని మంజరి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఇది రాష్ట్రంలో నమోదైన ఐదో కేసు అని తెలిపారు.

Kerala Reports 5th Monkeypox Case, 7 In India So Far

మంకీపాక్స్ లక్షణాలతో ఒకరు మరణించడంతో త్రిస్సూర్‌లో 20 మందిని క్వారంటైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు కుటుంబసభ్యులతోపాటు మరో 10 మందిని మాత్రమే కాంటాక్ట్ అయ్యాడని చెప్పారు. అందువల్ల ఇతర ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ స్టాండింగ్ కమిటీ సభ్యులు రెంజినీ తెలిపారు.

కాగా, దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఏడు కేసుల్లో ఐదు మంకీపాక్స్ కేసులు కూడా కేరళ నుంచే ఉన్నాయి. మరో రెండు కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే వ్యాపించే ఈ మంకీపాక్స్ వైరస్.. ఇప్పుడు అమెరికా, యూరోప్ దేశాల్లోనూ హడలెత్తిస్తోంది. ఇప్పటికే మంకీపాక్స్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దేశాలను అలర్ట్ చేసింది. పలు దేశాలు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+