మందు బాటిల్ తిరిగిస్తే.. రూ.20 వాపస్.. 'ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు..'
భారత్‌లో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా నిర్వహించకపోవడం కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భారీగా పెరిగిపోతోంది. ఈ మేరకు అనేక రాష్ట్రాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. ఇప్పటికే భారత్ లో ప్లాస్టిక్ ను రీ సైక్లింగ్ చేసి వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. పాల ప్యాకెట్ల నుంచి కాయగూరల వరకు ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నారు. అవి ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. సముద్రంలో లోతైన ప్రదేశం నుంచి ఎవరెస్ట్ శిఖరం అంచు వరకూ అంతా ప్లాస్టిక్ మయంగా మారిపోయింది. నదులు, కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయి. ప్రపంచంలో ఐదోవంతు ప్లాస్టిక్ వ్యర్థాలు భారత్ లోనే పోగవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా మందుబాబులు మద్యం తాగిన వెంటనే ఆ సీసాలను రోడ్లపై లేదా ఎక్కడబడితే అక్కడ పారవేస్తుంటారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కనిపిస్తుంటాయి. ఈ విధానాన్ని మార్చేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి మద్యం బాటిల్ పై అదనంగా రూ. 20 ముందస్తుగా డిపాజిట్ చేయనున్నట్లు పేర్కొంది. మళ్లీ అదే షాపులో మద్యం బాటిల్ తిరిగి ఇచ్చేస్తే డిపాజిట్ సొమ్మును వెనక్కు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

కేరళ రాష్ట్ర వ్యాప్తంగా బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 70 కోట్ల సీసాల మద్యం విక్రయిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం అమ్ముడవుతున్న మద్యం బాటిళ్లలో కేవలం 56 కోట్ల బాటిళ్లు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇక సాధ్యమైనంత వరకు గాజు సీసాల్లోనే మద్యం నింపాలని కేరళ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అయితే రూ.800 అంతకంటే ఎక్కువ ధర పలికిన మద్యాన్ని గాజు సీసాల్లోనే ఇవ్వాలని.. అంతకంటే తక్కువ ధర కలిగిన మద్యాన్ని ప్లాస్టిక్ బాటిల్స్ లో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.












Click it and Unblock the Notifications