చింత లేకుండా అయ్యప్ప చెంతకు- శబరిమల వెళ్లేవారికి శుభవార్త

కేరళలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. అయ్యప్ప మాలను ధరించి, మండలం పాటు నిష్ఠతో మణికంఠుడిని పూజిస్తారు. ఈ కాలంలో కఠిన నియమాలను అనుసరిస్తారు. అనంతరం అయ్యప్పను దర్శించుకోవడానికి తరలి వెళ్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి అయ్యప్పను దర్శించుకోవడానికి వ్యయ, ప్రయాసలను ఓర్చి శబరిమలకు వచ్చే భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

శబరిమల బేస్‌ క్యాంప్ నకు అత్యంత సమీపంలో ఉండే నీలక్కల్ వద్ద ఓ భారీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకుంది. దీనికి శంకుస్థాపన చేస్తోంది. అత్యాధునిక వసతులతో ఈ ఆసుపత్రి నిర్మితం కానుంది. దీనికోసం ట్రావన్‌కోర్ దేవస్వొం బోర్డు 6.12 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. దీనికి సంబంధించిన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. శబరిమల యాత్రికులు, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అత్యాధునిక ఆసుపత్రి రూపుదిద్దుకోనుంది.

Kerala set to Build Modern Hospital for Sabarimala Pilgrims at Nilakkal

ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు ఈ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైనంత స్థలాన్ని కేటాయించింది ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ శంకుస్థాపన చేయనున్నారు. శబరిమల, నీలక్కల్, పంపా పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో దీని నిర్మాణాన్ని చేపట్టిందక్కడి ప్రభుత్వం. లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు సేదతీరే బేస్ క్యాంప్ లోనే అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టవుతుందని భావిస్తోంది.

మొత్తం 10,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనుందీ ఆసుపత్రి భవనం. గ్రౌండ్ ఫ్లోర్‌లో రిసెప్షన్, పోలీస్ హెల్ప్ డెస్క్, మూడు ఔట్ పేషెంట్ రూమ్‌లు, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, ఐసీయూ, ఫార్మసీ, నర్సింగ్ స్టేషన్, ల్యాబొరేటరీ ఉంటాయి. డ్రెస్సింగ్ అండ్ ప్లాస్టర్ రూమ్‌లు, శాంపిల్ కలెక్షన్ ఏరియా, ఈ-హెల్త్ రూమ్, ఎలక్ట్రికల్ ప్యానెల్స్, లిఫ్ట్‌లు వంటి అవసరమైన సర్వీస్ కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేస్తారు.

మొదటి అంతస్తులో ఎక్స్-రే రూమ్, డాక్టర్స్ రూమ్, మైనర్ ఆపరేషన్ థియేటర్, స్క్రబ్ ఏరియా, ఆటోక్లేవ్ యూనిట్, డ్రెస్సింగ్ రూమ్, స్టోర్ రూమ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నిలక్కల్ ఆలయం ఎదురుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎటువంటి వైద్య సౌకర్యం అయినా ఈ ఆసుపత్రి నుంచే పొందవచ్చని దేవస్వొం బోర్డు వెల్లడించింది. అయ్యప్ప భక్తులతో పాటు స్థానికులూ వైద్యం పొందవచ్చని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+