వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతులు, యాక్టర్స్ పిక్చర్స్, పేరెంట్స్ ఫిర్యాదు: ఫేస్‌బుక్ పేజీ బ్లాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కొచ్చి: సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లోని ఓ పేజిలో యువతుల, చిన్నారుల అభ్యంతకర ఫోటోలు, చిత్రాలు, కామెంట్స్ ఉండటంతో బ్లాక్ చేశారు. కొందరు తల్లిదండ్రుల ఫిర్యాదు నేపథ్యంలో దానిని బ్లాక్ చేశారు. ఆ ఫేస్‌బుక్ పేజి 'కొచు సుందరికా' (యంగ్ బ్యూటీస్).

దీనిపై పలువురు తల్లిదండ్రుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో దానిని బ్లాక్ చేశారు. ఈ మలయాళ పేజిక్ 7,539 లైక్స్ ఉన్నాయి. చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. అందులో చాలామంది కేరళ, మిడిల్ ఈస్ట్ నుండి ఉన్నారు.

ఇందులో ఉంచే ఫోటోలు కేరళకు చెందిన యంగ్‌స్టర్స్ పర్సనల్ ప్రొఫైల్ నుండి సేకరించారు. మరికొన్ని సౌతిండియన్ నటీనటుల చిన్ననాటి ఫోటోలు తీసుకున్నారు. అందులో ఎలాంటి న్యూడ్ పిక్చర్స్ లేవు. అయితే, అందులోని ఫోటోలకు వచ్చిన చాలా కామెంట్స్ మరీ అసభ్యకరంగా ఉన్నాయి.

Kerala shocker: Facebook blots out page that used morphed pics of teenagers

తమ తమ పిల్లలు, కూతుళ్ల ఫోటోలు పెట్టారని చాలామంది పేరెంట్స్ గుర్తించారు. ఈ నేపథ్యంలో కొందరు గత వారం కేరళ సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించారు. సదరు ఫేస్ బుక్ పేజీని బ్లాక్ చేయాలని కోరారు. కాగా, ఆ ఫేస్ బుక్ పేజీలో ఎక్కువ శాతం మార్ఫింగ్ చేసిన యువతుల పిక్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఈ పేజీలో యువతులు పిక్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పాఠశాలకు, కాలేజీలకు వెళ్లే యువతులు, టీనేజర్స్‌వి ఉన్నాయి. ఈ ఫేస్ బుక్ పేజీని సౌదీ అరేబియా నుండి నడిపిస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది.

English summary
The social networking website Facebook page, which was in news for posting pictures of children and young girls has been blocked after a flurry of complaints from parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X