మైనర్ బాలుడిని లైంగిక వేధిస్తున్న టీచర్ అరెస్టు..

కోచి : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ మాష్టారు తన వక్రబుద్దిని బయటపెట్టుకున్నాడు. తన వద్ద ట్యూషన్ కు వచ్చే ఓ మైనర్ బాలుడిని లైంగిక వేధించాడు. 2015నుంచి కొనసాగుతున్న ఈ తంతు బాధిత బాలుడి ఫిర్యాదుతో తాజాగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కోచిలో సురేశ్(56) అనే టీచర్ ఆదివారం పూట తన ఇంటివద్ద పలువురు పిల్లలకు ట్యూషన్లు చెబుతుంటాడు. సురేశ్ ఇంటిపక్కనే ఉండే 16ఏళ్ల బాలుడు కూడా ట్యూషన్ లో జాయిన్ అయ్యాడు. అయితే ట్యూషన్ లో చేరిన నాటి నుంచే సదరు విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు సురేశ్.

Kerala teacher arrested on charges of sexually abusing 16-yr-old boy

బాధిత విద్యార్థి మాత్రం పరువు పోతుందనే ఉద్దేశ్యంతో.. విషయాన్ని ఎవరితో చెప్పలేదు. దీంతో సురేశ్ వేధింపుల పర్వం మరింతగా హెచ్చుమీరింది. అనేకసార్లు లైంగికంగా వేధించాడు. విషయం బయటకు పొక్కితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. 2015 నుంచి.. బాలుడిని ఇలా వేధించుకు తింటున్నాడు సురేశ్. అయితే ఇటీవలే సురేశ్ చర్యల పట్ల తీవ్రంగా విసిగిపోయిన బాలుడు ఇక వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బాలుడి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 377కింద కేసు నమోదు చేసిన పోలీసులు సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అతనికి 14వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+