లాడ్జీలో యువకుడి జననాంగం నరికేసిన ప్రియురాలు: ఎందుకంటే?
Recommended Video

మళప్పురం: కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 26ఏళ్ల యువకుడి జననాంగాన్ని అతడ్ని ప్రేమించిన యువతి తెగనరికింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కుట్టిపురంలో బుధవారం ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. సదరు యువతీయువకులు ప్రేమించుకుంటున్నారు. అయితే, ఆ యువకుడు మరో యువతితో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం సదరు యువతికి తెలిసి అతడిపై కోపం పెంచుకుంది.

ఈ నేపథ్యంలో అతడ్ని తీసుకుని ఓ లాడ్చీకి వెళ్లింది. తన వెంట ఓ కత్తి కూడా తెచ్చుకుంది. కాగా, కొద్దిసేపటికే ఆ యువకుడి అరుపులు వినిపించడంతో.. సిబ్బంది అప్రమత్తమయ్యారు. గది బయట రక్తపు మడుగులో పడివున్న యువకుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధితుణ్ని యువతి ప్రేమించినట్లు పోలీసులు తెలిపారు. అతడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తుండటంతో.. ప్రతీకార చర్యగా అతడి జననాంగాన్ని యువతి నరికినట్లు వివరించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications