ఇద్దరు డిప్యూటీల మధ్య నితీశ్ కుమార్.. కీలక శాఖలు వారికే, హోం శాఖ మాత్రం తన వద్ద..
బీహర్‌లో ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులకు శాఖలు కూటా కేటాయించారు. అయితే తక్కువ సీట్లు గెలిచిన జేడీయూ మనసులో ఎక్కడో సందేహాం... వారికే కాదు సగటు మనిషిలో కూడా ప్రశ్న. వీరి భాగస్వామ్యం ఎన్నాళ్లూ కొనసాగుతోంది. సావ్యంగా ఐదేళ్లు సాగుతోందా..? లేదంటే విభేదాలతో బయటకొస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనికి ప్రధాన కారణం.. మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీ సీఎం సీటు అడగలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నడచుకుంది. అయితే ఇద్దరూ డిప్యూటీలను నియమించింది. తార్‌కిశోర్ ప్రసాద్, రేణు దేవీలను ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చింది. దీంతో అధికార కేంద్రం వారి ఇద్దరి చేతిలో ఉంటోందా అనే సందేహం వస్తోంది. అయితే కీలకమైన హోం శాఖను తన వద్దే నితీశ్ కుమార్ అట్టిపెట్టుకున్నారు. దీంతో అప్పుడే బీజేపీతో కయ్యానికి సిద్దమనే సంకేతాలు పంపారనే విమర్శకులు అంటున్నారు.

తార్ కిశోర్ ప్రసాద్‌కు డిప్యూటీ సీఎం పదవీతోపాటు ఆర్థికశాఖ, వాణిజ్య పన్నులు, పర్యావరణ, అటవీ, ఐటీ, విపత్తుల నిర్వహణ, పట్టణాభివృద్ది శాఖలను అప్పగించారు. ఇటు రేణు దేవీ కూడా మరో డిప్యూటీ సీఎం.. ఆమెకు పంచాయతీరాజ్, వెనుకబడిన తరగతులు, ఈబీసీ సంక్షేమం, పరిశ్రమల శాఖలను ఇచ్చారు. వీరిద్దరికీ కీలకమైన శాఖలను అప్పగించడంతో.. అధికారం ఇక్కడే తిరుగుతుందని అర్థమవుతోంది.
పైకి మాత్రం సవ్యంగానే సాగుతోంది. కానీ విభేదాలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. కానీ చాణక్యుడు నితీశ్ కుమార్ మాత్రం చేజారి పోకుండా చూసుకోగలరని విశ్లేషకులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications